కృష్ణ

విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సిఎం దూరదృష్టికి నిదర్శనం ‘పట్టిసీమ’
* జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ
మచిలీపట్నం, డిసెంబర్ 27: పట్టిసీమ ప్రాజెక్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉమ మాట్లాడుతూ సముద్రంలో వృథాగా కలుస్తున్న తొమ్మిది టిఎంసిల గోదావరి జలాలను కృష్ణాకు మళ్ళించేందుకు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించామన్నారు. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాలెంజ్‌గా తీసుకుని ఆరు మాసాల్లో పూర్తిచేసి కృష్ణా - గోదావరి నదులను అనుసంధానం చేశారన్నారు. నదుల అనుసంధానం ద్వారా రూ.వెయ్యి కోట్ల ఖర్చుతో 2వేల 400కోట్ల విలువైన పంటలు పండించినట్లు తెలిపారు. గోదావరి జలాలతో మచిలీపట్నం ప్రజల దాహార్తిని తీర్చామన్నారు. పాఠశాల విద్యకు జిల్లాలో రూ.11వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని 6లక్షల మంది విద్యార్థుల్లో 3లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారని ఆయన చెప్పారు. 30వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, ఒక్కో ఉపాధ్యాయుడు పది మంది విద్యార్థులను దత్తత తీసుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని పిలుపిచ్చారు. జనవరి 1 నుండి విజయవాడలో జరిగే బుక్ ఫెస్టివల్‌కు విద్యార్థులను తీసుకెళ్లి పుస్తక పఠనం పట్ల వారిలో ఆసక్తి కలిగించాలన్నారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలను మంత్రి తిలకించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి, డివైఇఓలు గిరికుమారి, లక్ష్మీనారాయణ, ఆర్‌సిఎం పాఠశాలల డెప్యూటీ జనరల్ మేనేజర్ గుజ్జల మైఖేల్, 9వ వార్డు కౌన్సిలర్ కొట్టె వెంకట్రావ్, తదితరులు పాల్గొన్నారు.