జాతీయ వార్తలు

కేరళ ప్రజలకే అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆర్గనైజర్’ పత్రిక వ్యాసంపై మండిపడ్డ కేరళ సిఎం * బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
తిరువనంతపురం, నవంబర్ 28: ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార పత్రిక ‘ఆర్గనైజర్’లో ప్రచురించిన ఒక వ్యాసం పట్ల కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అది కేరళ ప్రజలను అవమానపరిచిందని అన్నారు. ఈ వ్యాసాన్ని ప్రచురించిన ఆర్గనైజర్ సంస్థ బేషరతుగా రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. ఆర్గనైజర్ దీపావళి ప్రత్యేక సంచికలో ఎం సురేంద్ర నాథ్ రాసిన ‘గాడ్స్ ఓన్ కంట్రీ ఆర్ గాడ్‌లెస్ కంట్రీ’ అనే ఈ వ్యాసం విషతుల్యమైందని శనివారం ఆ పత్రిక ఎడిటోరియల్ బోర్డుకు రాసిన ఓ లేఖలో ముఖ్యమంత్రి అంటూ, దాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ వ్యాసంలోని అంశాలు కేరళ ప్రజలను, ఇతర ప్రాంతాల్లో ఉన్న మలయాళీలను అవమానించేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఒక మలయాళీగా, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన రాష్ట్రం, తోటి మలయాళీల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని కూడా ఆయన అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతతత్వ విషాన్ని చిమ్మిన విషపు కోరలు ఇప్పుడు కేరళ ముంగిటికి కూడా వచ్చాయని ఆయన ఆ లేఖలో ధ్వజమెత్తారు.