జాతీయ వార్తలు

చెన్నై విమానాశ్రయంనుంచి టెక్నికల్ సర్వీసులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో 2-3 రోజుల్లో వాణిజ్య సర్వీసులు: కేంద్ర మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: వరద నీరు ముంచెత్తడంతో గత బుధవారంనుంచి మూతపడిన చెన్నై విమానాశ్రయంనుంచి శనివారం టెక్నికల్ విమాన సర్వీసులు ప్రారంభమైనాయని, కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభం కావడానికి మరో 2-3 రోజులు పడుతుందని కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ శనివారం ఇక్కడ చెప్పారు. కాగా, అన్ని విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించడానికి అవసరమైన ఎయిర్‌పోర్ట్ వ్యవస్థలు, కమ్యూనికేషన్, నేవిగేషన్, నిఘా వ్యవస్థలు. ఐటి, వాతావరణ పరికరాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని చెన్నై విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది. విమానాశ్రయం బేస్‌మెంట్ ఇంకా వరదనీటిలోనే ఉన్నందున, టెర్మినల్ బిల్డింగ్ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ఇంకా పూర్తిగా జరగనందున కమర్షిల్ విమాన సర్వీసులను ప్రారంభించలేక పోతున్నామని మంత్రి చెప్పారు. కాగా అరక్కోణంలోని రాజాలి నేవల్ ఎయిర్ స్టేషన్‌నుంచి శనివారం నాలుగు కమర్షియల్ విమాన సర్వీసులను నడిపినట్లు కూడా ఆయన చెప్పారు. శనివారం చెన్నై విమానాశ్రయంలో ఆపి ఉంచిన నాలుగు రవాణా విమానాలు ఢిల్లీ, ముంబయి, పోర్ట్‌బ్లెయిర్‌లకు బయలుదేరి వెళ్లినట్లు తెలిపారు. ఆదివారం నుంచి పగటివేళల్లో దేశీయ సర్వీసులను ప్రారంభిం చనున్నట్లు ఎయర్ పోర్ట్స్ అథారిటీ తెలిపింది.