అదిలాబాద్

సిసిఐ పునరుద్ధరణకు కేంద్ర మంత్రి హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఢిల్లీలో అనంత్ గిత్తేకు మంత్రి రామన్న వినతిపత్రం
ఆదిలాబాద్, డిసెంబర్ 22: ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, త్వరలోనే సిసిఐ పరిశ్రమ ఆధ్యయనానికి ప్రత్యేక అధికారుల బృందం జిల్లాకు రానుందని రాష్ట్ర మంత్రి జోగురామన్న తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఎంపి నగేష్‌తో కలిసి కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల మంత్రి అనంత్ గిత్తేను కలిసి ఆదిలాబాద్ సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై వినతి పత్రాన్ని సమర్పించారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమలపై కేంద్ర పరిశ్రమల శాఖ అధికారులతో కూడిన బృందం ఆధ్యయనం చేస్తుందని, అయితే దేశంలో సిమెంట్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయిన నేపథ్యంలో పరిశ్రమ పునరుద్ధరణకు చేయూతనందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు జోగు రామన్న పేర్కొన్నారు. కేంద్ర పరిశ్రమల శాఖ జాయింట్ కార్యదర్శి అధ్వర్యంలో కమిటీ బృందం పర్యటించిన అనంతరం రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో చర్చించి, సానుకూలంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. సిసిఐ ఫ్యాక్టరీ తెరిపించే వరకు తాము కేంద్రంపై ఒత్తిడి తేస్తామని రామన్న తెలిపారు. మంత్రి వెంట టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాజిదోద్దిన్ తదితరులు ఉన్నారు.

రైతు సేవల్లో తరిస్తేనే గుర్తింపు
* రెవెన్యూ శాఖ పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి
ఆదిలాబాద్, డిసెంబర్ 22: రెవెన్యూ పరమైన రైతు సమస్యలకు సత్వర పరిష్కారం కల్పించడంలో అధికారుల తీరు నిర్లక్ష్యంగా ఉందని, భూసేకరణ, రైతుల పరిహారం విషయంలో అంకితభావంతో సేవలందించినప్పుడే ప్రజల్లో సముచిత గుర్తింపు ఉంటుందని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని సబ్‌కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో రెవెన్యూ శాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్ జనగ్మోహన్ సమీక్షించి పలు మార్గదర్శక సూత్రాలు జారీ చేశారు. ప్రధానంగా రెవెన్యూ వసూళ్ళు, నీటిపన్ను వసూళ్ళు, భూసేకరణ తదితర అంశాల ప్రగతిపై సమీక్షించి, కొంత మంది తహశీల్దార్ల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. జవాబుదారితనంతో విధులు నిర్వహించి ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులు, కాలువల ద్వారా భూములు నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బుల చెల్లింపులు చేయాలని అన్నారు. ప్రభుత్వానికి రెవెన్యూపరంగా ఆదాయం తీసుకవచ్చి, లక్ష్యాలను అదిగమించాలని కలెక్టర్ అన్నారు. నాలా పన్ను వసూళ్ళలో ఆశించిన ప్రగతి సాధించడం లేదన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల కాలువల కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించి, ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఇందుకు ఆర్డీవోలు, తహశీల్దార్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జెసి సుందర్ అబ్నార్ మండలాల వారీగా తహసీల్దార్లతో వివిధ పథకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ కుమార్‌సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంజీవరెడ్డి, ఆర్డీవోలు సుధాకర్ రెడ్డి, శివలింగయ్య, ఐలయ్య, ఆయేషా మసరత్‌ఖానమ్, జిల్లాలోని మండల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

టెన్త్ పరీక్షల్లో మొదటి స్థానంలో నిలవాలి
* పివో ఆర్‌వి కర్ణన్
ఉట్నూరు, డిసెంబర్ 22: రాబోయే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతంలో జిల్లా మొదటి స్థానంలో ఉండడానికి సరైన ప్రణాళికలు తయారు చేయాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి (పివో) ఆర్‌వి కర్ణన్ అన్నారు. ఆయన ఐటిడిఎ పరిపాలన భవనంలో ఎజెన్సీ డిఈవోతో పాటు ప్రాజెక్ట్ మానిటరింగ్ సెల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ఐటిడిఎ పరిధిలోని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజన వసతి కల్పించాలని, ఉపాధ్యాయుల హాజరు, సమయ పాలన పాటించాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో విద్యార్థులచే పాఠ్యపుస్తకాల పఠనం చేయించాలని సూచించారు. గిరిజన సంక్షేమ అధికారులతో కలిసి పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య ఎటిడబ్ల్యూవోలు ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎజెన్సీ ఇన్‌చార్జి డిఈవో కుమ్ర నాగోరావు, మానిటరింగ్ అధికారి బోజరావు, పిఎంఆర్‌డిఎఫ్‌లు శ్రీకాంత్, మధుకిరణ్ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడిపై ప్రత్యామ్నాయ చర్యలు
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల సమావేశంలో కలెక్టర్ జగన్మోహన్
ఆదిలాబాద్, డిసెంబర్ 22: రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం జగన్మోహన్ గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో గ్రామీణ ప్రాంతాలలోని తాగునీటి సౌకర్యాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ ఎక్కడైతే భూగర్భ జలాలు అడుగంటి పోయి నీటి కొరత ఉందో ఆయా గ్రామాలను గుర్తించి, వెంటనే నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమయ్యే నిధుల కోసం సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులతో ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. అలాంటి వాటికి తక్షణమే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఏ ఒక్క గ్రామం నుండి తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు రాకుండా జాగ్రత్త వహించాలని, ఫిర్యాదులు అందినట్లయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో 889 పాఠశాలలకు గాను 800 పాఠశాలలకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం జరిగిందని, మిగతా 89 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్ల సౌకర్యం వెంటనే కల్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని పైపులైన్లు, రక్షిత మంచినీటి ట్యాంకులు, బోరుబావుల మరమ్మతులు ముందుగానే చేపట్టాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటి నుండే కార్యాచరణ ప్రణాళికకు రంగం సిద్ధం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు సుధాకర్ రెడ్డి, శివలింగయ్య, ఐలయ్య, ఆయేషా మసరత్‌ఖానం, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మూర్తి, ఇఇ వెంకటస్వామి, డిఇ వెంకటరమణ, డిఇలు, ఏఈలు పాల్గొన్నారు.