జాతీయ వార్తలు

వారికి శిక్షపడేలా చేయటమే నాకు మనశ్శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘వారికి శిక్షపడితేనే నాకు మనశ్శాంతి’.. ఈ మాటలు అంటున్నది ఓ కన్నతండ్రి. కనిపెంచిన కూతురి జీవితాన్ని నాశనం చేయటమే కాదు.. కనీసం బతకటానికి కూడా అవకాశం లేదంటూ క్రూరాతిక్రూరంగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కూతుర్ని చూసిన ఏ తండ్రి నోటి నుంచైనా వచ్చే మాటలే ఇవే. కనీసం కాల్చటానికి కూడా ఏమీ లేదంటూ 90 శాతం కాలిపోయిన ఉన్నావ్ బాధితురాలి మృతదేహాన్ని చూసినవారేకే గుండె తరుక్కుపోతుంటే ఇక కని పెంచిన తండ్రికి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదనుకుంటా. అందుకే చేతులెత్తి ‘వారికి శిక్షపడేలా చూడండని’ ప్రార్థిస్తున్నాడు. అపుడే నాకు మనశ్శాంతి అని కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ‘‘ నాబిడ్డను చంపిన వాళ్లను పరుగుపెట్టించి కాల్చి చంపండి. ధన బలంతో గ్రామంలో తమను బతకనివ్వటం లేదు. మమ్మల్ని, మా బంధువులను ప్రతిరోజూ వేధిస్తున్నారు. నాకు ఆర్థిక సాయంగానీ, ఇతరత్రా ఏమీ వద్దు, వాళ్లను చంపితేనే నాకు మనశ్శాంతి’’ అని ఆక్రోశించాడు. కాగా ఉన్నావ్ సోదరుడు సైతం ఇదే తరహాలో కన్నీరుమున్నీరవుతున్నాడు. తన సోదరి శరీరం ఏముందని ఆమెకు దహన సంస్కారాలు చేయాలి. 90 శాతం కాలిపోయింది అంటూ కన్నీరు పెట్టాడు. అందుకే ఆమె మృతదేహాన్ని పూడ్చిపెడుతున్నామని తెలిపాడు.