జాతీయ వార్తలు

ఉన్నావ్ బాధితురాలి కుటుంబానికి ప్రియాంక పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ బాధితురాలికి యూపీ ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయిందని విమర్శించారు. గతంలో ఓసారి హత్యాయత్నం జరిగిన తరువాత కూడా ఆమెకు రక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవటానికి నిరాకరించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. మహిళల రక్షణకు యోగి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవటం లేదని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. బాధిత కుటుంబాన్ని ఏడాది నుంచి వేధిస్తూనే ఉన్నారని, వాళ్లకు బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని ప్రియాంక ఆరోపించారు. నేరగాళ్లకు రాష్ట్రంలో స్థానం లేదని చెప్పిన సీఎం మహిళలకు స్థానం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. నేరగాళ్లకు భయం లేకుండా పోయిందని అన్నారు. అంతకుముందు ఆమె ట్విట్టర్‌లో ఉన్నావ్ బాధితురాలికి నివాళులర్పించారు.