అంతర్జాతీయం

పాక్‌ తీరుపై ఐరాసలో భారత్‌ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస : పాకిస్థాన్‌ ఓ ఉగ్రవాద దేశమని, యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్‌ తీరుపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐరాస జనరల్‌ అసెంబ్లీలో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన అనంతరం భారత్‌ తన వాదనలను దీటుగా వినిపించింది. ఐరాసలో భారత పర్మనెంట్‌ మిషన్‌లో ఫస్ట్‌ సెక్రెటరీ ఈనమ్‌ గంభీర్‌ మాట్లాడుతూ, మానవ హక్కుల ఉల్లంఘనే ఉగ్రవాదమని, పాక్‌ యుద్ధ నేరాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఐరాస ఉగ్రవాదులని పేర్కొన్న వ్యక్తులు పాక్‌ వీధుల్లో దర్జాగా తిరుగుతున్నారని, ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలకు విరాళాలు సేకరిస్తున్నాయని ఆమె అన్నారు.