జాతీయ వార్తలు

ఇంటర్‌వ్యూ కాల్‌లెటర్స్ ఇక రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇంటర్‌వ్యూ కాల్‌లెటర్స్ ఇక స్వస్తిచెబుతున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) తెలిపింది. వాటికి బదులుగా ఇ-సమ్మన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ప్రతి ఏడాది ఐఏఎస్, ఐపిఎస్ ఉద్యోగాలకోసం యుపిఎస్‌సి పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. వాటిలో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షతోపాటు ఇంటర్‌వ్యూలు ఉంటాయి. ఈ ఏడాది నిర్వహించిన పరీక్షల్లో పర్సనాలిటీ టెస్టును మార్చి 8 నుంచి నిర్వహించే అవకాశం వుంది. అయితే ఈ పర్సనాలిటీ టెస్టుకోసం కాల్స్‌లెటర్స్‌ను పంపించబోమని స్పష్టం చేసింది. మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారుwww.upsc.gov.in వెభ్‌సైట్ నుంచి కాల్‌లెటర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఒకవేళ కాల్‌లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏ విధమైన ఇబ్బందులు తలెత్తినా, ఇంటర్‌వ్యూ తేదీకి ఐదురోజుల ముందుగా తమకు సమాచారం అందించాలని తెలిపింది.