రుచి

ఊరించే ఊరగాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. ఒక్క ముద్ద తింటే చాలు స్వర్గానికి బెత్తడు దూరంలో ఉన్నట్లు తెలుగువారు భావిస్తుంటారు. వేసవి సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆవకాయ తప్పనిసరిగా ఏడాదికి సరిపడా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకున్న ఆవకాయను చిన్న సైజు జాడీలోకి తీసుకుని వీటిలో మునగ కాడలు, వెల్లుల్లి, అల్లం, పెస ర వంటివాటిని కలుపుకుని రెండు నెలల పాటు నిల్వచేసుకుని రోజుకో రకం పచ్చడి తినే అలవాటు చాలా ప్రాంతాల్లో ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.

పెద్ద ఆవకాయ
ఈ పచ్చడిని పెడతారు. ఈ కాయలు కడిగి తుడిచి ముక్కలుగా షాపులోనే చేసి ఇస్తారు. కొన్నిచోట్ల ఈ ముక్కలను కేజీల లెక్కన కొన్ని ప్రాంతా ల్లో అమ్ముతారు. మధ్యలో టెంక ఉండి జీడి పొర ఉంటుంది. ఇది చెంచాతో తీసివేసి ఈ ముక్కలు మూడు కేజీలు ముక్కల్లో ఒక అరకేజీ కారం, అరకేజీ ఉప్పు, అరకేజీ ఆవపిండి కలపాలి. నూనె ఒకటిన్నర కిలో కలపాలి. ఇందులో 50 గ్రాముల మెంతిపిండి, పసుపు రెండు చెంచాలు కలిపి జాడీలో నిల్వచేసుకోవాలి. పచ్చడి పెట్టిన తరువాత మూడులోజుల పాటు గరిటెతో కలియబెట్టాలి. ఇలా చేయకపోతే బూజు పడుతుంది.

మెంతి మాగాయ
చిన్నసైజు మామిడి కాయలు - 12, మెంతిపొడి - 1/2 కేజీ, వేయించిన కారం - 1/2 కేజీ, కళ్ళ ఉప్పు కేజీ, నూనె- 1కేజీ, ఇంగువ - చిన్నడబ్బా, మెంతులు - 1 కప్పు, పసుపు - 4 చెంచాలు
ముందుగా మామిడికాయ లు కడిగి ఆరబెట్టి తొక్క తీసుకోవాలి. గుత్తి వంకాయమాదిరి నాల్గు టెంకలుగా చేసి వాటి మధ్యలో మెంతి కారం కూరాలి. బాణీలో కొద్దిగా నూనె వేసి మెంతులు, ఎండుమిర్చి వేయించి మిక్సీ పట్టాలి. ఈ పిండిని కూరినవి ఆరు కాయలయితే మిగతావి ముక్కలుగా తరిగి పొయ్యాలి. మూడు రోజుల తరువాత ఈ ముక్కలను పిండి, ఊట ముక్కలు టెంకలు విడివిడిగా ఎండబెట్టి బాగా ఎండనివ్వాలి. ఎండాక ఇంగువ వేసి నూనె కాచి చల్లార్చిన నూనెలో ముక్కలు వేసి కలపాలి. ఊటలో వేసి మళ్లీ కలిపి మూతపెట్టుకోవాలి. వారం తర్వాత మళ్లీ కలపాలి. వర్షం పడ్డాక ముక్కలు బాగా ఊరి పచ్చడి రుచిగా ఉంటుంది.

పచ్చి మాగాయి
పనె్నండు మామిడి కాయలు సన్నగా ముక్కలు తరగాలి. ఉప్పు, పసుపు వేసి మూడు రోజులు ఊరనిచ్చి, పిండి ఎండలో పెట్టాలి. నాల్గవ రోజు దీనికి 1/2 కేజీ కారం, 1/4 మెంతిపిండి, 1/4 ఆవపిండి కలపాలి. 1 కేజీ నూనెలో కొన్ని ఇంగువ మ్కులు, 12, పెద్ద ఎండు మిరపకాయలు, 1 కప్పు ఆవాలు వేయించి ఈ ముద్దకి కలపాలి.
కోరు పచ్చళ్ళు
ముక్కలు తినలేనివాళ్ళు కోరులా కోరి, దీనికి ఆవపిండి ఉప్పు, బెల్లం, అల్లం కోరు 1 కప్పు కలిపి మూడవరోజు ఎండలో పెట్టాలి. ఇలా నాల్గు రోజులు పెట్టాక తింటే బాగుంటుంది. దోశె, అన్నం, చపాతి దేనికైనా బాగుంటుంది.
వివిధ రకాల ఆవకాయలు
పై విధంగా చేసుకున్న ఆవకాయ పచ్చడిని ఒక చిన్న జాడిలోకి తీసుకుని ఇందులో శుభ్రపరచిన శెనగలు ఒక కప్పు ఆవకాయకి కలిపితే శెనగల ఆవకాయ అవుతుంది. కొందరు కొబ్బరి ముక్కలు చేర్చుతారు, కొన్ని ప్రాంతాల్లో అల్లం ముక్కలు కూడా వేస్తారు,వెల్లుల్లి పాయలు 100 గ్రాములు పొట్టు వలిచి కలిపితే వెల్లుల్లి ఆవకాయ అవతుంది. అలాగే ఆవకాయలో శుభ్రం చేసిన పనస గింజలను కూడా కలిపి ఊరబెడతారు.
మునగకాడలతో..
మునగకాడలు ముక్కలుగా తరిగి శుభ్రంచేసి ఆవకాయలో కలిపి ఊరబెట్టుకుని తింటారు.
నువ్వుపిండితో
నువ్వులు ఒక కప్పు వేయించి పిండి చేసి ఒక కప్పు ఆవకాయకి కలపండి. నువ్వు ఆవకాయ రెడీ.
బెల్లంతో..
కారం ఉప్పు, ఆవ పిండిని కలిపి ఒక కప్పు చొప్పున తీసుకోవాలి.మూడు కప్పుల తరిగిన బెల్లం ఈ ఆవకాయలో కలిపితే కమ్మటి బెల్లం ఆవకాయ సిద్ధం అవుతుంది.
పెసర ఆవకాయ ఇది చలువ చేస్తుంది. దీనిలో ఆవపిండి 1/2 కప్పు, పెసరపిండి ఒకటిన్నర కప్పు, కారం ఒక కప్పు, ఉప్పు ఒక కప్పు, నూనె ఒక కప్పు మామిడిముక్కలకు కలుపుతారు. దీనిలో కొబ్బరి ముక్క లు, శెనగలు కూడా కలుపుకోవచ్చు.
అల్లంతో ఆవకాయ
ఈ ఆవకాయలో అల్లం కోరు 1 కప్పు కలుపుతారు. అల్లం రుచి పచ్చడి చాలా బాగుంటుంది. ఇలాంటి ఆవకాయ పచ్చళ్లు ఫ్రిజ్‌లో రెండు నెలలు మాత్రమే ఉంటాయి. వారానికి ఒక రకం ఆవకాయ కలుపుకొని తింటే ఆ రుచి ఎంతో కమ్మగా ఉంటుంది.
పులిహోర ఆవకాయ
ఆరు మామిడి కాయలను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇందులో సరిపడా కారము, ఆవపిండి, ఉప్పు కలపాలి. 1/2 కేజీ నూనెలో శెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకఱ్ఱ, ఎండుమిర్చి, కరివేప, ఇంగువ, వేయించిన పోపుపెట్టిన తరువాత కలుపుకోవాలి. ఇలా తయారైన పచ్చడి రుచిగా ఉంటుంది.

- వాణీప్రభాకరి