ఉత్తరాయణం

ఆ చర్యలు అసమంజసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుణ్ జైట్లీ పేరును ట్విస్ట్ చేస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేసినందుకుగానూ, రాహుల్‌గాంధీపై హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌ని కోరడం అనుచితం. నిజానికి రాహుల్ ట్వీట్ ఏ విధంగానూ సభ్యుని హక్కుల్ని భంగపరిచేది కాదు. సభలో సభ్యుడికి తన బాధ్యతల నిర్వహణలో పూర్తి స్వేచ్ఛ కల్పించే దిశగా, అందుకు అవరోధం కల్పించేవారిని శిక్షించేలా ఈ ఏర్పాటు మన రాజ్యాంగంలో ఉంది. అంతే తప్ప వారిపై వ్యంగ్యోక్తులు, పరిహాసాలు పూర్తి నిషిద్ధమని కాదు. రాహుల్ హాస్యాన్ని తేలిగ్గా తీసుకుని వదిలేస్తే మంత్రిగారికి, సభకి హుందాగా ఉండేది. పెట్టీకేసు తరహాలో పెద్దశిక్షకి పూనుకోవడం అనవసర ప్రక్రియ. తప్పుడు అన్వయం. లోక్‌సభ స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలి. అలాగే కేవలం ఐదువందల రూపాయల వ్యయంతో ఆధార్ వివరాల్ని అడ్డదారిలో సేకరించగలగడం ఎంత సులభమో ట్రిబ్యూన్ పత్రిక ప్రచురించింది. అందుకుగానూ ఆ పత్రికపై ఆ కథనం రాసిన జర్నలిస్టుపై ఆధార్ సంస్థ క్రిమినల్ కేసు పెట్టింది. ఇది సరికాదు. వ్యవస్థలోని లోటుపాట్లు, లోపాలను బయటపెట్టడం పాత్రికేయుల వృత్త్ధిర్మం. బాధ్యతగా పనిచేసినవారిపై ఇలా కక్షసాధింపునకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చెడు సంప్రదాయం. కేంద్రప్రభుత్వం స్పందించి ఆధార్ సంస్థకు తలంటడం మేలు. వ్యక్తిగత గోప్యతకు భరోసా ఇవ్వకుండా ఇలా వ్యతిరేక చర్యలకు పాల్పడటం భావ్యం కాదు. నిజానికి లోపాలను ఎత్తిచూపిన జర్నలిస్టుకు బహుమతి ఇవ్వాల్సిందిపోయి కేసులు పెట్టడం విడ్డూరం.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
ఎన్‌ఆర్‌ఐల సేవలు మరువలేం
ప్రపంచంలోని పలు దేశాల్లో ఉంటున్న భారతీయులు మాతృదేశానికి ఎనలేని సేవలందిస్తున్నారు. దేశాభివృద్ధిలో వారి పాత్ర గతంకన్నా ఇప్పుడు విస్తృతమైంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవాస భారతీయులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుగా ఎల్‌ఎం సింఘ్వి అధ్యక్షతన ఏర్పడిన హైలెవల్ కమిటీ ప్రవాసీ దివస్ ప్రతిపాదనను తీసుకువచ్చింది. సాధారణంగా జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహిస్తారు. 2003 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం మొదలైంది. జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి స్వదేశానికి వచ్చిన రోజున ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి సింగపూర్‌లో ఆసియాన్ దేశాలతో సంబంధాలు ఏర్పడిన పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రవాసీ దివస్ నిర్వహించారు. అమెరికా, కెనడా, సింగపూర్, గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా భారతీయులు ఉన్నారు. మాతృదేశ సేవలో తమవంతు పాత్ర పోషిస్తున్న ప్రవాస భారతీయులకు ఎన్నడూ లేని ప్రాధాన్యతను మోదీ ప్రభుత్వం ఇస్తోంది. దేశాన్ని సాంకేతిక, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో సమున్నత స్థానానికి చేర్చడానికి వారి సేవలు అవసరమని కేంద్రం భావిస్తోంది.
-కె.సతీష్‌రెడ్డి, పరకాల