ఉత్తరాయణం

నిరసనలకూ హద్దుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడలో రచయిత స్కైబాబాకు వ్యతిరేకంగా కొందరు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. ఆయన రచనలపై అభ్యంతరాలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలే గాని అభ్యంతరకరమైన రీతిలో వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. నిజానికి ఇటీవలికాలంలో సాహితీవేత్తలపై దాడులు పెరిగిపోతున్నాయి. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టే రచయితల కలాల పీకలు కోసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలను విమర్శించే రచయితల ప్రాణాలు తీస్తున్నారు. స్కైబాబా రాసిన కవితల్లో ఒకటి అభ్యంతరకరంగా ఉన్నమాట నిజమే. సాహిత్యం అంటే బూతు కాదు. విమర్శ, పదునైన భాష కోసం ఘాటైన పదాలు వాడొచ్చుకానీ ఇలా బూతు పదాలను రాయడం బాధాకరం. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలా విచ్చలివిడిగా భాషను భ్రష్టుపట్టించడం సరికాదు. ఆయన రాసిన బూతు రచనలను నిషేధించాలి. అదే సమయంలో దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలి. కవులు సమాజాన్ని చూసి స్పందించాలే తప్ప కులమతప్రాంతీయ భావాలతో వ్యవహరించడం సరికాదు.
-విరాజిత, తిరుపతి