ఉత్తరాయణం

కేంద్రం నీతి బోధలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీతి అయోగ్ పేరుని నీతి బోధల అయోగ్‌గా మార్చడం మేలు. దేశాన్ని మేలిమలుపు తిప్పగల ప్రణాళికల్ని రచిస్తారని, ఉన్న ప్రణాళికా సంఘాన్ని పీకేసి మరీ నెలకొల్పబడిన సంస్థ, ఆ పని ఎంతవరకూ చేస్తుందో తెలీదుగానీ అడక్కుండానే సలహాలు మాత్రం ఇచ్చేస్తుంది. తమ ఈతిబాధలకన్నా ఆ అర్థంపర్థంలేని నీతిబోధలే ఎక్కువగా బాధపెడుతున్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రానికి, నీతి అయోగ్ ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటుని చూసి తేల్చేశారు - ఇంక ఈ రాష్ట్రానికి ఎలాంటి చేయూతలు అవసరం లేదని. పైగా జోకేశారు - హైదరాబాద్‌లో ఉన్న నలభై శాతం మంది ఆంధ్రులు ఈ రాష్ట్రానికి వచ్చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి రుగుండదని. ఎంత అసందర్భమైనా అపహాస్యమిది! అమెరికాలో సెటిలైన వారి గురించి ఇంకా ఏమీ అనలేదు. అది కూడా కలిపేస్తే రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన పన్నుల వాటా కూడా ఎత్తేయొచ్చు మరి. గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించమని ఉచిత సలహా ఇచ్చారు. రాష్టవ్య్రాప్తంగా పండుగ సీజనంతా ఏటీఏంలు మూగబోయింది ఇందుకేనేమో? అలా అయితే ఆ తరహా లావాదేవీలపై అదనపు సుంకాలు వేసి, ప్రజల్ని దోచుకోవడమెందుకు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రాష్ట్రాలతో సమానంగానే వ్యవహరిస్తామని అనడం అదనాలేవీ ఉండబోవని చెప్పడమే. విభజన చట్టం దఖలు పరిచిన నష్టపరిహారాలు, ఆర్థిక వెసులుబాట్లూ, హక్కులూ రాష్ట్రం పొందిన తరువాతే ఈ మాటలు మాట్లాడాలి. ప్రత్యేక హోదాలైనా, ప్యాకేజీలైనా మన రాష్ట్రానికి నష్టపరిహారం కిందే లెక్క. అరవైశాతం పన్నులవాటా ఉన్న రాజధానిని కోల్పోయి, రాజధాని లేని రాట్రంగా మిగిలిపోయినందువల్లనే ఈ చేయూత కోరడం. ఏతావాతా తేలిందేమిటంటే ఏపీకి రావాల్సిన హక్కులపై నీతిఅయోగ్‌కి కాని, కేంద్రానికి గానీ సద్భావన, స్పష్టత లేవని. ఇవి మా హక్కులు అని ఒప్పించలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇది. రాజకీయ వైఫల్యం కూడానూ.
-దాడిచిలుక శంకర్, విజయనగరం
ఫిరాయింపులను అడ్డుకోవాలి
తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు పార్టీలు మారడం మామూలైపోయింది. పదవుల తాయిలాలతో విపక్ష సభ్యులను అధికార పార్టీలు ఆకర్షిస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి ఇది మాయనిమచ్చ. తమను ఎన్నుకున్న ప్రజలను మోసపుచ్చుతూ స్వలాభం కోసం పార్టీలు మారుతున్న నేతలపై చర్యలు తీసుకోవడంలో కూడా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అందువల్లే ఏ భయం లేక, నాయకులు పార్టీలు ఫిరాయిస్తున్నారు. ఇప్పటికే పార్టీలు ఫిరాయించిన నాయకులపై రెండు రాష్ట్రాల్లో ఫిర్యాదులు చేసినా చర్యలు మృగ్యం. ప్రజలే ఇలాంటి ఫిరాయింపుదార్లకు బుద్ధిచెప్పాలి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం