ఉత్తరాయణం

పరిణామ సిద్ధాంతం.. అధికారిక రాద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి సత్యపాల్‌సింగ్ డార్విన్ పరిణామ సిద్ధాంతం తప్పు అని సెలవిచ్చారు. దానికి ఆయన తెచ్చిన ఋజువేమిటంటే ఆ సిద్ధాంతం చెబుతున్నట్టుగా కోతి నుంచి మనిషి పుట్టాడన్నది ఎవరూ చూడలేదు, రాయలేదు కదా అన్నది. వాదన బాగానే ఉంది. కానీ ఒక శాస్ర్తియ సిద్ధాంతం తప్పు అని నిరూపించడానికి వితండ వాదన ఒక్కటే సరిపోదు. ప్రత్యామ్నాయ వైఖరికి మద్దతుగా బలమైన, నిరూపించదగ్గ సాక్ష్యాలు కావాలి. అవి లేకుండా మాట్లాడడం కేవలం సొంత అభిప్రాయం కిందే మిగిలిపోతుంది. ఆయన ఇంతటితో ఆగినా బాగుండేది. పాఠ్యాంశాల్లోంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించాలని ఎకాయెకీ తీర్మానించారు. అది బరి తెగింపు. బాధ్యతారాహిత్యం. ప్రజల్లో శాస్ర్తియ దృక్పథం పెంపొందించేలా ప్రభుత్వం కృషి చేయాలని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చెబుతున్నాయి. అమాత్యులు అందుకు భిన్నంగా ప్రవర్తించకూడదు. డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ప్రపంచం అంగీకరించింది. ససాక్ష్యంగా ఋజువుచేయనిదే, నేను ఏది చెబితే అది సత్యం అంటే కుదరదు. బాధ్యతాయుత పదవుల్లో ఉండేవారు ఆషామాషీగా మాట్లాడకుంటా ఉంటే మేలు. మంత్రిగారు కోతి నుండి మనిషి ఉద్భవించాడని నమ్మలేకపోవచ్చు. కానీ బుద్ధుల్లో మనిషి నుండి కోతిగా మారొచ్చనేది నమ్మితీరాలి. అదే.. పరిణామ సిద్ధాంతం. కాకపోతే ఉల్టాపల్టా!
డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
యూట్యూబ్‌లో
కాళేశ్వరం పనులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇటు గవర్నర్, అటు కేంద్రం ఈ ప్రాజెక్టుల వేగాన్ని చూసి అచ్చెరువొందుతున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాజెక్టు గురించి విపులంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసిన సీఎం పట్టుదలగా ఆ ప్రాజెక్టు పనులు చేయించడాన్ని గవర్నర్ ప్రశంసించడం విపక్షాలకు నచ్చినట్లు లేదు. వారి విమర్శల్లో పదును లేదు. నిజానికి ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు, దశలపై నెలనెలా వీడియో తీసి వాటిని యూట్యూబ్‌లోను, ప్రభుత్వ వెబ్‌సైట్లలోనూ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పని ఏమిటో తేటతెల్లం అవుతుంది. కువిమర్శలు చేస్తున్నవారికి సమాధానం చెప్పినట్లూ ఉంటుంది. నిజానికి తెలంగాణలో రైతులకు కాళేశ్వరం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇలాంటి పనులపై సరైన విమర్శలు చేయకపోతే విపక్షాలు ప్రజలకు దూరం అవుతారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రాజెక్టు పనుల్లో లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని సరైన మార్గంలో పెడితే అప్పుడు విపక్షాలకు విలువ ఉంటుంది. రాజకీయ వైరంతో విమర్శలు చేస్తే ఉపయోగం ఉండదు సరికదా నష్టం తప్పదు.
-చామర్తి వెంకటరామకృష్ణ, హైదరాబాద్