ఉత్తరాయణం

‘జై హింద్’ మంచి సంప్రదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదిలో ఉపాధ్యాయుడు హాజరు తీసుకునే సమయంలో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ‘జై హింద్’ అంటూ ప్రతిస్పందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆదేశాలు అభినందనీయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పాఠశాలలు సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు చొరవ చూపాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తరగతి గదుల్లో హాజరు తీసుకొనేటపుడు విద్యార్థులు ‘ప్రెజెంట్ సార్, ప్రెజెంట్ మేడం’ అంటున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఈ సంప్రదాయం ఇంకా కొనసాగడం సమంజసం కాదు. దీనికి భిన్నంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విధానం అందరికీ అనుసరణీయం. కేంద్ర ప్రభుత్వం ‘జై హింద్’కు సంబంధించి రాష్ట్రాలకు నిర్దిష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
పాలన తెలియని కేజ్రీవాల్
రాజ్యాంగం పట్ల ఎలాంటి అవగాహన లేని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరచూ అభాసుపాలవుతున్నాడు. నోటి దురుసుతనంతో ఆయన కష్టాలను కోరితెచ్చుకుంటున్నాడు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని తిట్టిపోసి పరువునష్టం కేసులో జరిమానా చెల్లించాడు. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే ‘ఓటింగ్ యంత్రాల’ వల్లే అలా జరిగిందని దుమ్మెత్తి పోశాడు. ఒక ఓటింగ్ మిషన్‌ను ‘టాంపర్’ చేసి చూపించమని ఎన్నికల కమిషన్ అడిగితే పలాయనం చిత్తగించాడు. ఇటీవల 20 మంది ‘ఆప్’ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ప్రధాని నరేంద్ర మోదీపై ఒంటి కాలిపై లేచాడు. రాజ్యాంగం పట్ల అవగాహన లేనందునే కేజ్రీవాల్ పాలనలో విఫలం అవుతున్నాడు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే- ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం.
- కె.ప్రవీణ్, కాకినాడ
రాహుల్ పనితీరు ఇదేనా?
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాటు తేలాడని ఓ వైపు మీడియా ప్రచారం చేస్తున్నా, ఆయన పనితీరులో అంతగా మార్పు కానరావడం లేదు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేలా రాహుల్ సహకరించడం లేదు. ఓ ప్రధాన పార్టీ నేతగా ఆయన తన బాధ్యతలను నెరవేర్చడం లేదు. ప్రధాని మోదీపైన, బీజేపీపైన విమర్శలు చేసేందుకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు. మోదీ ప్రభుత్వం ఎంతో సాహసోపేతంగా ప్రవేశపెట్టిన ‘తలాక్’ బిల్లును రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో అడ్డుకుంటోంది. ప్రగతిశీల చట్టాలను రాజకీయ కోణంలో అడ్డుకోవడం సరికాదు. దేశాన్ని ముందుకు నడుపుతానంటున్న రాహుల్ పనితీరు ఇదేనా?
- జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్