ఉత్తరాయణం

వాటేన్ ఐడియా కేసీఆర్ జీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక తెలివైన రాజకీయ వ్యూహం రచించారు. కాంగ్రెస్, బిజెపి రహిత ‘మూడో సమాఖ్య’ను జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటు చేస్తానన్నారు. ప్రధాని మోదీని, కాంగ్రెస్ పార్టీని ఒకే వ్యాఖ్యలతో తెగనాడడం ద్వారా తన తాజా వ్యూహానికి నాంది పలికారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని దేవతగా కేసీఆర్ పొగిడారు. రాష్టప్రతి ఎన్నికల సందర్భంగా కోరకపోయినా మద్దతు ఇచ్చి, మోదీని వీలైనంత మేరకు పొగుడుతూనే ఉన్నారు. జాతీయ పార్టీలతో ఇంత వరకూ సఖ్యతగానే ఉన్నారే తప్పితే విరుచుకుపడింది లేదింత వరకూ. అయితే పరిస్థితులు మారుతున్నాయి. మోదీ ‘ఒకేసారి ఎన్నికల ఆలోచన’కి మొగ్గు చూపుతున్నారు. అది వాస్తవ రూపం దాల్చితే నష్టపోయేది ప్రాంతీయ పార్టీలే. జాతీయ స్థాయి భోవోద్వేగాలు, సమస్యలు ముందుకు వచ్చి, స్థానిక సమస్యల్ని మింగేస్తాయి. పైగా మోదీ ఇమేజ్ పెద్దగా కనబడి భాజపాకు లాభం తెస్తుంది. తెలంగాణలో ఇపుడు స్థానిక భావోద్వేగాలేమీ లేవు. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంశం అదనం. వెరసి తెరాసకు నష్టం. వీటిని అధిగమించాలంటే కేసీఆర్ గీత పెంచి మోదీ గీతకు సమం చెయ్యాలి. జాతీయ స్థాయిలో ఎలా ఉన్నా రాష్ట్రంలో మిగతా ప్రతికూలతలను పక్కకు నెట్టొచ్చు. సో.. వాటేన్ ఐడియా కేసీఆర్ జీ!
- డా.డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం
కబ్జాదారుల ఆట కట్టించాలి
ఏ ముహూర్తాన ‘నవ్యాంధ్ర’ ఏర్పడిందో కాని విజయవాడ గ్రామీణ ప్రాంతంలో భూ బకాసురుల ఆగడాలకు నేడు అంతులేకుండా పోయింది. స్వాతంత్య్ర సమరయోధులకు, కాలేజీలకు కేటాయించిన భూములను గుండాయిజం ద్వారా కొందరు కబ్జా చేస్తున్నారు. స్థలాలు కలిగిన వ్యక్తులను, సంస్థలను బెదిరించి, అవసరమైతే వారిని అంతం చేయడానికి కూడా కబ్జాదారులు వెనుకాడడం లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని రాజధాని ప్రాంతంలో చెలరేగుతున్న అక్రమార్కులపై కేసులు నమోదు చేయించి జైళ్లకు పంపించాలి.
- పి.శ్రీనివాసరావు, కర్నూలు
తెలుగు ప్రాధికార సంస్థ ఏమైంది?
తెలుగుభాష సర్వతోముఖాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా తెలుగు ప్రాధికార సంస్థను వెంటనే ఏర్పాటు చేయాలి. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలి. ఇంటర్మీడియెట్ వరకు తెలుగు సబ్జెక్టును నిర్బంధాంశంగా చేయాలి. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీలను వెంటనే విభజించి ఆంధ్ర ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయాలి. మైసూరులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజస్ (సిఐఐఎల్)లో తలదాచుకుంటున్న తెలుగు ప్రాంతీయ విభాగాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన వసతులను గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కేంద్ర మానవ వనరుల శాఖకు నివేదించింది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తెలుగు పీఠాన్ని అమరావతికి తరలించేలా చర్యలు తీసుకోవాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు