ఉత్తరాయణం

ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముప్పు అని తెలిసినా ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. ప్రతి అవసరానికీ ప్లాస్టిక్‌పైనే ఆధారపడుతున్నాం. ప్లాస్టిక్ క్యారీబ్యాగుల తయారీకి అడ్డూఅదుపూ లేదు. వీటిపై నిషేధం విధించినా దుకాణదారులు అతిక్రమిస్తున్నారు. ప్లాస్టిక్ క్యారీబ్యాగులలో వేసిన ఆహార పదార్థాలను భుజించడంవల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి. అటువంటిది క్యారీ బ్యాగులలో వేడి వేడి ఆహార పదార్థాలు వేసి అమ్ముతున్నారు. ఇవి తినడం మరీ అపాయకరం. వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. వాటిని పొరపాటున మేతతోపాటు మింగి పశువులు మృత్యువాత పడుతున్నాయి. జనారణ్యాల మధ్య మనుషులు నిర్లక్ష్యంగా వేస్తున్న చెత్త కుప్పలుగా పేరుకుపోగా, భరించలేక వాటిని తగలబెడితే వాటిలో బాగాపేరుకుపోయిన క్యారీబ్యాగులు తగలబడి వాతావరణం కలుషితమవుతోంది. ఇది పీల్చి మానవులు వ్యాధిగ్రస్తులవుతున్నారు. పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ చేటుచేస్తున్న క్యారీబ్యాగుల వాడకాన్ని, తయారీని సంపూర్ణంగా నిషేధించాలి. ప్రజలు స్వచ్ఛందంగా వాటి వాడకాన్ని ఆపివేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

సభల్లో గలాభా
రాజ్యాంగ విరుద్ధం
మన సిఎం ఆదేశాలమేరకు మన ఎంపీలు పార్లమెంట్‌లోని వెల్‌లోకి దూసుకుపోయి రికార్డులు, ఫైళ్లు లాక్కున్నారు. నినాదాలు చేశారు. ఒకాయన చిడతలు వాయించి వెల్‌లో పడుకున్నాడు! ఇంత జరిగినా జైట్లీ పాత పాటే పాడారు అని కొన్ని పత్రికలు వ్యాఖ్యానించాయి. ఇలా హంగామా చేస్తే ప్రపంచంలోని ఏ ప్రభుత్వం అయినా తల వంచి కోర్కెలు తీర్చేస్తుందా? అంతెందుకు? మన అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఇలాగే ప్రవర్తిస్తే సిఎం వారి కోరికలు తీర్చేస్తాడా? పార్లమెంట్ ఉన్నదే చర్చలకోసం. గల్లా జయదేవ్ ఒక్కరే పదునుగా తన వాదన వినిపించాడు. ఇంకా గలాభా సృష్టించండి, సస్పెండ్ చేసినా ఫర్వాలేదని సిఎం అనడం రాజ్యాంగ విరుద్ధం!
- పూర్ణారావు, కాకినాడ

కులాల సంగ్రామంలో
రాజకీయ నేతలకే లబ్ధి
ఆకర్షణీయ నినాదాలతో పది మందితో జైకొట్టించుకోవడంలో సిద్ధహస్తుడు కెసిఆర్. అందుకు రిజర్వేషన్ల పెంపు నినాదానికి మించింది ఏముంటుంది? కాని ఇది ప్రమాదకరమైన గేమ్. తమని బిసిల్లో కలపాలని కొన్ని కులాలు, షెడ్యూల్ కులాల్లో కలపమని మరికొన్ని కులాలు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. బిసిలుగా ఉన్నవాళ్లు ఇతరుల్ని తమలో కలపరాదని హెచ్చరిస్తున్నారు. క్రమక్రమంగా అభివృద్ధిపధం వీడి మన దేశం కులాల సంగ్రామంలో కూరుకుపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాగుపడేది రాజకీయ నేతలే తప్ప ప్రజలు కాదు. తస్మాత్ జాగ్రత్త!
- చైతన్య, వాకలపూడి