ఉత్తరాయణం

దారితప్పిన ద్రవ్య నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నిర్వహణపై ‘కాగ్’ వెలిబుచ్చిన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోదగ్గవి. విభజనానంతరం ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి గడ్డుకాలంలో మరింత క్రమశిక్షణ అవసరం. పైసాపైసా సమర్ధవంతంగా ఖర్చుచేయాల్సిన సందర్భం ఇది. ‘కాగ్’ లెక్కలు చూస్తుంటే అందుకు పూర్త్భిన్నమైన వాతావరణాన్ని చూపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల కన్నా ఖర్చులో విచ్చలవిడితనం, బాధ్యతారాహిత్యం కనిపిస్తున్నాయి. ఇవి ప్రతిపక్షాల ఆరోపణలకు, కేంద్రం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. రెవెన్యూ రాబడి కన్నా వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరగడం, హద్దులు దాటి అప్పులు చెయ్యడం, చేసిన వాటిలో ఆస్తుల కల్పనకు, మానవ వనరుల వృద్ధి అంశాలకు తక్కువగా కేటాయించడం లాంటివి ఆందోళన కలిగించేవే. బడ్జెట్ అనుమతించిన దాని కన్నా ఎక్కువ వ్యయం కొన్ని చోట్ల అయితే, నిధులు మురిగిపోవడం మరికొన్నిచోట్ల కనిపిస్తోంది. ఆఖరి నిమిషంలో హడావుడి ఖర్చులు మరికొన్నిచోట్ల. ఈ రకమైన ఉటంకింపులు తేలిగ్గా తీసిపారేయ్యాల్సినవి కావు. రాష్ట్రం నడకని, భవిష్యత్తుని నిర్ణయించేవి ఇవే. కేంద్రం నుండి రావాల్సిన రాయితీలు, హక్కులు, హామీల కోసం పోరాడుతూనే, రాష్ట్రం నిలదొక్కుకునే చర్యలు చేపట్టాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే విజన్ గడువులు పొడిగిస్తూపోవడమే తప్ప, విజన్ అందుకోవడం ఎన్నటికీ ఉండదు. కాగ్ లెక్కలపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
అన్నింటికీ ప్రభుత్వమే కారణమా?
బ్యాంకుల్లో భారీ కుంభకోణాలకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. బ్యాంకులు, ఎల్‌ఐసి లాంటివి స్వతంత్ర వ్యవస్థలు. వాటి రోజువారీ వ్యవహారాల్లో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. అవినీతిని అరికట్టడం ఆడిటర్లు, ఆర్‌బిఐ బాధ్యత. ఆడిటర్లు, మేనేజర్లు కుమ్మక్కయి భారీగా లంచాలు మేసి కుంభకోణాలకు పాల్పడతారు. ఒక మేనేజర్ బదిలీ అయి మరొకరు వచ్చినప్పుడే కుంభకోణం బయటపడుతుంది. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లనే పాత కుంభకోణాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేయడం, చట్టాల్ని సవరించడం జరిగింది.
- భాస్కర్, అశోక్‌నగర్
రభసతో కాలక్షేపం
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా ప్రజలకు, నేతలకు ప్రజాస్వామ్య సూత్రాలు ఇంకా వంటబట్టలేదు. పార్లమెంటు, అసెంబ్లీలు ఉన్నది సమస్యలు పరిష్కరించుకోడానికే. మన నేతలకు చర్చించే సామర్థ్యం గాని, విషయ సేకరణపై తగిన శ్రద్ధగాని లేవు. చట్టసభలో తొడగొట్టి మీసం మెలిపెట్టేదొకడు, రోజుకొక విచిత్ర వేషంతో జోకర్‌లా ప్రవర్తించేదొకడు, ‘వెల్’లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరు ఎత్తించేది కొందరు, మైకులు విరగ్గొట్టేది, కాగితాలు చింపి వేసేది కొందరు. ఈ రభతో సభ వాయిదా పడటం రాజ్యాంగ విరుద్ధమే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఇలాంటి రభసకు ప్రభుత్వం లొంగిపోతుందని కొందరు భావించడం కేవలం వారి భ్రమ.
- లంబకర్ణ, రాజేంద్రనగర్