ఉత్తరాయణం

ప్రపంచ ‘అశాంతి దూత’ ట్రంప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యనే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ అన్నారు-‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు’ అని. బహుశా ఆయన ఉద్దేశం ‘ప్రపంచ -అశాంతి’ బహుమతి అయ్యుండొచ్చు. అలా అయితే నూటికి నూరు పాళ్ళు ఆయనే కరెక్ట్. ఎందుకంటే ఏ మాత్రం అవకాశం వచ్చినా అశాంతి రేపడానికి ట్రంప్ వెనుకంజ వేయడం లేదు. అయితే ఇవన్నీ తన ఎన్నికల వాగ్దానాలే కావడం ప్రపంచ దేశాల ప్రారబ్దం. తాజాగా ఇరాన్‌తో ఏడు బలమైన దేశాలు కుదుర్చుకున్న అణ్వాయుధ నిరాయుధీకరణ చారిత్రాత్మక ఒప్పందానికి ఒక్క కలం పోటుతో ట్రంప్ మంగళం పలికాడు. ఎంతో శ్రమకోర్చి, ఎన్నో సంప్రదింపులు జరిపిన మీదట గతంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా సాధించిన శాంతి ఒడంబడిక అది. తద్వారా పశ్చిమాసియాలో కొంత భద్రత, శాంతి నెలకొన్నాయి. ఇరాన్ ఆ ఒప్పందానికి కట్టుబడి తన అణ్వాయుధ తయారీ కార్యక్రమాలు ఆపెయ్యడమే కాకుండా, అంతర్జాతీయ సంస్థల తనిఖీలకు పూర్తి సహకారమందించింది. వారివైపు నుండి ఏ వాగ్దాన భంగమూ లేదు. అయినా అమెరికా ‘తూచ్’ అంటూ చాప చుట్టేసింది. అయినా అదేదో ఆ రెండు దేశాలమధ్య ఏర్పడిన ద్వైపాక్షిక ఒప్పందమన్న రీతిలో. ఇది పచ్చి దుందుడుకుతనం. బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా, జర్మనీ దేశాలు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పడం గుడ్డిలోమెల్ల. చివరిదాకా ఆ మాటకు కట్టుబడి ఉండడమే కాకుండా, అమెరికా నిర్వాకాన్ని వ్యతిరేకించాల్సి ఉంటుంది. భారత్ తన దౌత్య సంబంధాల్లో పూర్తి స్వంత ముద్రని కలిగి ఉండడం, స్వప్రయోజనాల పరిరక్షణ విషయమై ఏమాత్రం రాజీలేని ధోరణి చూపించడం ఎంత అవసరమో అర్థం చేసుకోవాలి. అమెరికా ఏకపక్ష ధోరణికి బలమైన వ్యతిరేకత తెలపాల్సిన అవసరం ఉంది.
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

మాతృమూర్తిని ఆదరిద్దాం
ప్రపంచంలోని అత్యధిక దేశాలు మే నెలలో రెండవ ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. సృష్టిలో ప్రతి మనిషిని నవ మాసాలు మోసి కనిపెంచిన ‘అమ్మ’ ఆప్యాయత, అనురాగం, మమకారం వెలకట్టలేనిది. అనురాగమూర్తి ‘అమ్మ’. అమ్మ మంచిదనం గూర్చి ఎంత చెప్పినా తక్కువే. కనిపించని దైవం కన్నా కనిపించే దైవం ‘అమ్మ’. అమ్మ అనే పిలుపులోనే ఆత్మీయత వుంది. తాను తినకున్నా తన పిల్లలకు తినిపించి తృప్తిపడుతుంది. అయితే, ఇటీవలి కాలంలో తల్లులను పోషించకుండా కొన్ని కుటుంబాల్లో పుత్రరత్నాలు వారిని వృద్ధాశ్రమాలలో చేర్పిస్తున్నారు. ముదుసలి వయస్సులోని తల్లులను ఆదరించడానికి బదులు వారిని నిర్లక్ష్యంగా చూస్తున్నారు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవారు, ధనవంతులు సైతం తల్లులకు సరైన గౌరవం ఇవ్వడం లేదు. ఆస్తిపాస్తులను పొందిన అనంతరం ఇంట్లో నుంచి తల్లులను గెంటివేస్తున్న కుమారులున్నారు. దేవాలయాల ముందు, నడి వీధులలో, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, హోటల్స్ ముందు నిలబడి భిక్షాటన చేస్తున్న తల్లులున్నారు. నేటి నాగరిక కాలంలో కుమారులకంటే కుమార్తెలే తల్లులను ఆదరిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే తల్లులతో మనసు విప్పి మాట్లాడేవారే కరువయినారు. కనీసం ఈ మాతృ దినోత్సవం రోజునైనా మన తల్లులతో సంతోషంగా మాట్లాడుదాం. వారికి సముచిత గౌరవం ఇద్దాం. మాతృదినోత్సవానికి సార్థకత తెద్దాం. అమ్మలారా.. తల్లులారా.. మమ్ములను కన్నందుకు- మీకు శతకోటి వందనాలు. మీకు జీవితాంతం సేవచేసినా తక్కువే. మీరే లేకుంటే ఈ సృష్టేలేదు. మీ త్యాగం, ఓపిక, దయ ఎనలేనివి.
- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట

‘గ్రాఫ్’ పడిపోయింది..
అహం పెరిగితే అంతే! ఇటీవల భారతీయ జనతాపార్టీ గ్రాఫ్ పడిపోయింది. అధినాయకత్వం పెడపోకడలే ఇందుకు కారణం అని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భాజపాని ఎద్దేవా చేశారు. గాని తెదేపాదీ అదే పరిస్థితి అని జనం గ్రహిస్తున్నారు. గత కొద్ది వారాలుగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు, పనులూ ఆయన స్థితప్రజ్ఞత కోల్పోయినట్టు సూచిస్తున్నాయి. చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఇలా వ్యవహరించ లేదు. ఆయన ఇలా మారడానికి కారణం- తెదేపా గ్రాఫ్ పడిపోవడం, వైకాపా అధినేత జగన్ గ్రాఫ్ పెరుగుతూ ఉండడం, చంద్రబాబుకి ‘జనసేన’ పార్టీ నేత పవన్ కల్యాణ్ దూరం కావడం అని ప్రజలు చెప్పుకుంటున్నారు.
- లక్ష్మి, కాకినాడ