ఉత్తరాయణం

గుర్తుండిపోయే ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేడియంలో కళ్లు చెదిరే షాట్లతో, విన్యాసాలతో, విధ్వంసకరమైన ఆటతో ప్రపంచం నలుమూలలా కోట్లాది అభిమానుల మనసులను గెలిచిన దక్షిణాఫ్రికా సంచలన ఆటగాడు ఎ.బి.డివిలియర్స్ అకస్మాత్తుగా క్రికెట్‌కు రిటైర్మెంట్ చెప్పి, క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేశాడు. అతని రిటైర్మెంట్ దక్షిణాఫ్రికా క్రికెట్‌కు తీరని లోటు. ఇంకా ఎన్నో ఏళ్ళు ఆడే సత్తా వున్నా, యువ క్రికెటర్లకు స్వాగతం పలికే ఉద్దేశంతో అతను తీసుకున్న నిర్ణయం అభినందనీయం, ఆదర్శనీయం. అ యితే, రాబోయే ప్రపంచ కప్ పోటీలకు ముందు అతని నిర్ణయం సరికాదేమో. ప్రతి ప్రపంచ కప్‌లోనూ దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతోంది. తదుపరి ప్రపంచ కప్‌లో డివిలియర్స్ తన శక్తియుక్తులన్నీ ప్రదర్శించి, దక్షిణాఫ్రికాకు ప్రపంచకప్‌ను అందించి రిటైరేతే అతణ్ణి ఆ దేశం ఎల్లవేళలా గుర్తుంచుకునేది. టీ-20, వనే్డ, టెస్ట్‌లు.. ఫార్మాట్ ఏదైనా ప్రత్యర్థులపై ఎదురుదాడే లక్ష్యంగా అనేక రికార్డులు నెలకొల్పిన డివిలియర్స్ లాంటి క్రీడాకారుణ్ణి చూడలేమేమో! రిటైర్మెంట్ తరువాత క్రికెట్‌కు అతని సేవలు కొనసాగించాలి. ఎంతోమంది నాణ్యమైన క్రికెటర్లను తన శిక్షణలో తయారుచేయాలి. మాతృదేశ జట్టును అత్యుత్తమంగా తయారుచేయడంలో తన వంతు పాత్రను పోషించాలి. డివిలియర్స్.. నిన్ను క్రీడాకారులు ఎన్నటికీ మరచిపోలేరు.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం