ఉత్తరాయణం

ఎన్నాళ్లీ ‘గ్యాస్’ భారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు లక్షలాది మంది సామాన్యులు సైతం వంట గ్యాస్ సిలిండర్‌పై రాయితీ వదులుకున్నారు. అప్పటి నుండి నాన్ సబ్సిడీ గ్యాస్ ధరను భారీగా పెంచుకుపోతున్నారు. అంతర్జాతీయంగా పెంపుదల పెద్దగా లేకపోయినా, చమురు కంపెనీలు పెట్రోలియం ధరలను భారీగా పెంచుతూ ఇబ్బడిముబ్బడిలా లాభాలార్జిస్తున్నాయి. ఆ లాభాలు ప్రభుత్వాలకు, ఉద్యోగులకే గాని ప్రజలకు దక్కటం లేదు. ప్రభుత్వ సంస్థలిలా దోపిడీ చేస్తుంటే ప్రైవేటు సంస్థలే నయం అనే స్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోధరల విషయంలో నిర్లిప్తతగా వ్యవహరిస్తోంది. ఏ పార్టీకి అధికారంలోకి తీసుకురావాలన్నా సామాన్య ప్రజానీకమేగాని, సంపన్న వర్గాలు కాదని ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి. వంట గ్యాస్‌పై ధరల పెంపును నియంత్రించాలి. సబ్సిడీ సిలిండర్లను గతంలో వలె వినియోగదారులకు నేరుగా సబ్సిడీ ధరలకే అందిస్తే ఆ కొద్ది మొత్తం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే పని తప్పుతుంది. బ్యాంకు సిబ్బందికీ అదనపు పనిభారం తప్పుతుంది. గ్యాస్‌పై ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గాలంటే ఏడాదికి ఒకటో, రెండో సబ్సిడీ సిలిండర్ల సంఖ్య తగ్గించినా ఇబ్బంది లేదు, వినియోగదారులకు అనవసరపు ఇక్కట్లు తప్పుతాయి.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట

అంతా స్వయంకృతం..
కర్నాటక సీఎం కుమారస్వామి- ‘అధికార పీఠంపై నేను సంతోషంగా లేన’ని ఇటీవల ఓ సభలో కన్నీరు కార్చాడంటే అది ఆయన స్వయంకృతమే. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు ఆయన్ని నమ్మడం లేదు. గతంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి సీఎం అయాడు. ఆ తర్వాత భాజపాతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసి, ఒప్పందం ప్రకారం గడువుతీరాక సీఎం పదవిని భాజపాకు అప్పగించడానికి నిరాకరించాడు. భాజపా మద్దతు ఉపసంహరించడంతో ఆయన ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆయన పూర్వ విరోధి అయిన కాంగ్రెస్‌తో చేయి కలిపి సీఎం పదవిని చేపట్టాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయనకు తెలియదా? పదవిపై ఆశ తీరక కోరి కష్టాలు తెచ్చుకున్నాడు.
- పవన్‌పుత్ర, కాకినాడ

ఎంపీగా ఏం చేస్తారు?
తెదేపా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యల్లో కొన్ని నిజాలున్నాయి. రాజకీయ వాతావరణం బాగాలేక తాను పార్లమెంటు సమావేశాలకు వెళ్లాలని అనుకోవడం లేదని ఆయన చెప్పడం సరికాదు. తనకు హిందీ, ఇంగ్లీష్ భాషలు రానందున పార్లమెంటుకు వెళ్లి తాను ఏం చేయాలనడం వింతగా ఉంది. మరి పార్లమెంటుకెందుకు ఆయన పోటీచేసినట్టు? తెదేపా అవిశ్వాసం పెట్టినా కేంద్ర ప్రభుత్వం ఓడిపోయే పరిస్థితి లేదనడం సత్యమే. అవిశ్వాసానికి వ్యతిరేకంగా జేసీ మాట్లాడుతున్నాడు కనుక తెలుగుదేశం తమ్ముళ్లు ఆయన్ని కూడా భాజపాతో కుమ్మక్కు అయ్యాడని అంటారేమో?
-భస్కర్, కాకినాడ