ఉత్తరాయణం

వర్షాకాలం కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలు ఎన్నో కష్టాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా మురికి కాలువల వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. రోడ్లపై నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో పరిస్థితిని అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీడియా కూడా అక్కడి అవస్థలను వెలుగులోకి తెస్తోంది. అడ్డగుట్ట ప్రాంతంలో అంతకంటే తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అధికారులు స్పందించవలసిన అవసరం ఉంది.
-పి.శ్రీనివాసులు, హైదరాబాద్
అవాస్తవాలకు అడ్డుకట్ట
ప్రఖ్యాత సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ కొత్తగా ప్రారంభించిన ‘కంటెక్స్ట్’ ఫీచర్ అవాస్తవ వార్తలు, కథనాలు, పుకార్లను అడ్డుకునేందుకు ఉపయోగపడనుంది. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఫేస్‌బుక్ వేదికగా అవాస్తవాలు, పుకార్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. నిజానికి ఎఫ్‌బి విశ్వసనీయతకు అది సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా సెనేటర్, ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యుడు మార్క్ వార్మర్ ప్రఖ్యాత సామాజిక మాధ్యమ సంస్థలు గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ యాజమాన్యాలతో భేటీ అయ్యారు. అవాస్తవ వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేసే ఏర్పాట్లు చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఫేస్‌బుక్ రెండు రోజుల క్రితం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ‘కంటెక్స్ట్’ అన్న ఫీచర్‌ను వినియోగించుకుని నిజనిర్ధారణ చేసుకోవచ్చు.
-బి.మధుసూదన్ రెడ్డి, బేతంచర్ల
వైమానిక దళానికి వందనం
దేశ రక్షణలో వైమానిక దళం సేవలు నిరుపమానం. ప్రపంచ యుద్ధాలతో వైమానిక దళం పాత్ర వెలుగులోకి వచ్చింది. ఆధునిక కాలంలో వైమానిక దళం కేవలం రక్షణకే పరిమితం కావడం లేదు. సామాజిక బాధ్యతలనూ నిర్వర్తిస్తున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. 1932లో రాయల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పేరుతో ఆవిర్భవించిన మన వైమానిక దళం పేరు తరువాతి కాలంలో మారింది. అణ్వాయుధాలను గగనతలం నుండి ప్రయోగించే సామర్థ్యాన్ని సాధించింది. రేపోమాపో యుద్ధ విమానాలను నడిపేందుకు మహిళలకు అవకాశం ఇవ్వనుంది. అక్టోబర్ 8వ తేదీన వాయుసేన దినోత్సవం నిర్వహించునున్న సందర్భంగా వాయుసేన సిబ్బందికి వందనం చేయడం గర్వకారణం.
-కామిడి సతీష్‌రెడ్డి, వరంగల్