ఉత్తరాయణం

నిర్దిష్టత లేని జీఎస్టీ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాది గడచినప్పటికీ దేశంలో ‘వస్తుసేవా పన్ను’ (జీఎస్టీ) విధానం ఇంకా గాడిన పడలేదు. మహిళా సంఘాల పోరాటానికి దిగివచ్చి ప్రభుత్వం శానిటరీ నాప్కిన్స్‌పై పన్ను పూర్తిగా తొలగించింది. నిత్యావసర సరకులు, మందులు వంటి అనేక వస్తువులు వౌలిక అవసరమైనందున వాటిపై కూడా జిఎస్టీ తొలగించాలని సామాన్య, పేద తరగతి ప్రజల విజ్ఞప్తులను ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజల అవసరాలను దృష్టిలో వుంచుకొని, వివిధ పన్ను శ్లాబులలోకి ఉత్పత్తులను చేర్చడంలోను, పన్నుల రేట్లు తగ్గించడంలోనూ ఒక నిర్దిష్ట విధానం అవలంబించడం లేదు. ఎన్నికలను, రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాజాగా కొన్ని వస్తువులపై పన్నుల శాతం తగ్గించి, 15వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోందని నేతలు ప్రచారార్భాటాలకు దిగడం హాస్యాస్పదం. ఓటర్లనో, వ్యాపారులనో ఆకర్షించేందుకు పన్నుల శ్లాబులను మార్చడం వల్ల ఈ విధానంపై సామాన్యులకు నమ్మకం సడలిపోతోంది. జీఎస్టీ వచ్చాక చిన్న పరిశ్రమలకు పన్నుభారం పెరిగింది. చిన్న పరిశ్రమల విక్రయాలపై 1% జీఎస్టీనే ఉంటుందని చట్టం చెబుతోంది. ఇది నిజం కాదు. ఈ పరిశ్రమలు తమకు కావలసిన ఉపకరణాలు, ముడి పదార్థాలు కొనుగోలు చేసుకుందుకు కూడా పన్ను చెల్లించాల్సి వుంటుంది. విక్రయాలపై పన్ను రద్దుచేయమని చిన్న పరిశ్రమలు కోరలేవు. అందువల్ల చిన్న పరిశ్రమలు రెండురకాలుగా పన్ను భారాన్ని మోస్తున్నాయి. ఇదే సమయంలో భారీ పరిశ్రమల చేసే కొనుగోళ్లపై జీఎస్టీని పూర్తిగా రద్దుచేశారు.
దేశవ్యాప్తంగా సామాన్యులపై ధరాభారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోనికి తేవాలని ఆర్థిక నిపుణులు పలు సూచనలు చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం అదిగోఇదిగో అంటూ కుంటిసాకులు చూపించి ఎందుకు తాత్సారం చేస్తోందో అర్థం కాదు. దైనందిన జీవితంలో అవసరమయ్యే సరుకుల ధరలు తగ్గుతాయని ఎదురుచూసిన సామాన్య, పేద వర్గ ప్రజలకు తీవ్రమైన నిరాశే మిగిలింది. ఈ వ్యవస్థతో చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్ సంస్థలు పన్ను ఎగవేతకు యధాశక్తి కృషిచేస్తున్నాయి. పన్నుల చెల్లింపుదారుల సంఖ్య అయితే పెరిగింది కానీ పన్నుల మొత్తం మాత్రం ఆశించినంత స్థాయిలో పెరగలేదన్నది నిర్వివాదాంశం. కేంద్ర ప్రభుత్వ అపసవ్య విధానాల కారణంగా ‘ఒకే దేశం-ఒకే పన్ను’ అన్న లక్ష్యం నీరుగారిపోతోంది. రాజకీయ అవసరాలకు అనుగుణంగా పన్నుల శాతంపై నిర్ణయాలను తీసుకుంటోందన్న అప్రతిష్ట ప్రభుత్వం మూటకట్టుకుంటోంది.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం