ఉత్తరాయణం

ఏపీకి తీవ్ర అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు కోరుతూ రాష్ట్రంలోని ప్రజలంతా పోరాడుతుంటే ప్రధాని మోదీ మాత్రం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలలో 85 శాతం అమలు చేసినట్లు ఘనంగా ప్రకటించారు. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా తప్పుల తడకగా వున్న అఫిడవిట్‌ను దాఖలుచేసి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవపట్టించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. తాజాగా తిరుపతి ఐఐటీకి, తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీకి నిధులు విడుదల చెయ్యకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఋణం ఇప్పిస్తామని ప్రకటించడం తెలుగు ప్రజలను మళ్లీ మోసం చేయడమే. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 11 కేంద్ర విద్యాసంస్థల నిర్మాణానికి మూడువేల వంద కోట్ల నిధులు ఇవ్వాల్సి వుండగా గత నాలుగేళ్ళలో కేవలం 99 కోట్లు మాత్రం ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. పైగా కొత్త రాష్ట్రానికి చేయాల్సిందంతా చేశామని ప్రకటించి మిగతా నిధుల కోసం అప్పులబాట పట్టమని సలహా ఇవ్వడం- ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి వున్న రాష్ట్రాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే. అత్యున్నత విద్యాప్రమాణాల కోసం భారీగా నిధులు ఖర్చుచెయ్యవలసి వున్న విద్యాసంస్థలను అప్పుచేసి నిర్మాణం చేయవలసి రావడం తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం, మరొకపక్క అయిదు కేంద్ర విద్యాసంస్థల నిర్మాణం నిధులు లేక ఆగిపోగా, ఎన్‌డిఏ పాలిత రాష్ట్రాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త విద్యాసంస్థల నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇచ్చిన నిధులతో శరవేగంతో సాగుతుండడం మోదీ సర్కారు అవకాశవాద రాజకీయాలకు మరొక నిదర్శనం.
- సి.హెచ్.ప్రతాప్, శ్రీకాకుళం

గాలివాటం నేతలు!
ఆంధ్ర ప్రాంతంలో ఒక నేత ప్రజలు తనను మర్చిపోతారేమోనన్న బెంగతో కాపు రిజర్వేషన్ల అంశాన్ని నెత్తిన వేసుకొని ఆందోళనలు ప్రారంభిస్తే, ఆయనను సీఎం చంద్రబాబు గృహ నిర్బంధంలో పెట్టించాడు. దీంతో చంద్రబాబును ‘కాపుల విరోధి’గా పేర్కొంటూ తిట్టిపోశాడానేత. ఇప్పుడు వైకాపా అధినేత జగన్ కాపు రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలో లేవని అంటే ఆ కాపునేతకు కోపం వచ్చి, చంద్రబాబే మంచోడు జగన్ కాపు విరోధి అని ప్రకటించేశాడు. జాట్‌లు, గుజ్జర్లకు రిజర్వేషన్లు కల్పించే ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే కోర్టు రద్దు చేస్తుందని కాపునేతలకూ తెలుసు. అయినా, వివిధ పార్టీల నాయకులు ఆందోళనలూ, వ్యాఖ్యానాలూ చేస్తుంటారు కాలక్షేపం కోసం. ఎటు గాలివీస్తే అటు తిరిగే ‘గాలి కోళ్లు’ ఈ నేతలు!
- సుభాష్, కాకినాడ

దేవుడి పేరిట విద్వేషాలు
దేవుడికి కూడా నేడు కొందరు కులాన్ని ఆపాదిస్తున్నారు. ఇటీవల ఒక నాయకుడు తన పార్టీ బహిరంగ సభలో దేవుడికి కులాన్ని ఆపాదించి, విమర్శలకు గురైన సంఘటన తెలిసిందే. ఇక, కొన్ని కులాలు మరీ వింతగా ప్రవర్తిస్తుంటాయి. ఆయా దేవుళ్లపై తమకే అన్ని హక్కులు ఉన్నట్లు కొన్ని కులసంఘాల వారు భావిస్తుంటారు. కొన్ని దేవాలయాల్లో వారికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ‘ఈ దేవుడు ఈ కులం వాడని, ఈ దేవత మా కులం దేవత’ అని వారు చేసే ఉత్సవాలలో పెడ ధోరణులు కనిపిస్తుంటాయి. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. నరనరాల్లో కులతత్వం జీర్ణించుకు పోవటంతో బహిరంగ సభలో మాట్లాడిన ఆ నాయకుడి నైజం బయటపడింది. సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలి. లేకుంటే ఇదే పరిస్థితి. ఆ మతం తప్పని, ఈ మతం గొప్పదని కొన్ని మతాలు చెప్పుకోవటమే తప్పు. మత ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పేదలకు సేవ చేయడంలో లేదు. మతాన్ని, కులాన్ని రాజకీయ దురుద్దేశాలకు ఉపయోగించుకుంటున్న కొందరు నేతలు సమాజంలో లేనిపోని విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
-ఎ.ఆర్.ఆర్.ఆర్, ఖమ్మం