ఉత్తరాయణం

ఎన్నికల దిశగా మోదీ ప్రసంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి ఇది చివరి సంవత్సరం. ఎన్నికలు జరిగాక కొత్త ప్రభుత్వం కొన్ని నెలల్లో ఏర్పడాల్సి ఉంది. అందరూ ఊహించినట్టుగానే ప్రధాని తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని కాస్త ఎన్నికల శంఖారావంగా తీర్చిదిద్దారు. తనకున్న పెద్ద ఆశయాల్ని, అవి తీరాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గతంలో ప్రకటించిన ఆశయాల సాధనలో ఎంత ముందంజ వేసిందీ అవసరం మేరకు మాత్రమే తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల వైపుఎలా పరుగులు తీస్తుందో చెప్పారు. పెరుగుతున్న సంపదలో అధిక భాగం ఒక్క శాతం ధనికులకు వెళ్లి, మిగతా వాళ్లకు ఎలా మొండి చెయ్యి మిగులుతుందో చెప్పలేదు. ఆర్థిక విధానాల వల్ల పేద, ధనిక తారతమ్యం పూడ్చలేనంతగా ఎలా పెరుగుతూ వస్తోందో, దానిని ఎలా సరిదిద్దగలరో మాట మాత్రంగా కూడా చెప్పలేదు. ప్రత్యక్ష పన్నుల సేకరణ రెట్టింపు అయినట్టు చెప్పినా, కొద్దిమంది ఆర్థిక నేరాల వల్ల బ్యాంకులు వేల కోట్లరూపాయల్ని ఎలా నష్టపోయాయో, చట్టాన్ని వారెంత తప్పించుకోగలిగే స్థితిలో ఉన్నారో లేదో చెప్పలేదు. మహిళల రక్షణకు కఠిన చట్టాలు తీసుకురావడం, వారికి సైన్యంలో తాత్కాలిక సర్వీస్ స్థానే శాశ్వత కమిషన్ ఏర్పాటు చెయ్యడం మంచివే కానీ అవి అసంపూర్ణం. రోజుకు కనీసం నలుగురు అతివలపై అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో కేసుల నమోదు దగ్గర నుండి న్యాయం అమలు వరకు శీఘ్రత సాధించడానికి ఇంకా తొలి అడుగులే పడలేదు.
ఒక మంచి నిర్ణయం ‘ఆయుష్మాన్ భారత్’. ఏభై కోట్లమందికి ఐదు లక్షల రూపాయల మేరకు ఆరోగ్య బీమా. అయితే అందుకు తగ్గ నిధులు, వౌలిక సదుపాయల కల్పన, రాష్ట్ర ప్రభుత్వాలతో ఏర్పాట్లు విషయమై చూస్తే మొదటి అడుగు పడనట్టే. ఐదారుమాసాల్లో బుడిబుడి అడుగులు కూడా కష్టమే. ప్రజలు తమ ఆరోగ్య అవసరాలకి రూపాయిలో అరవై పైసలు ఖర్చుపెడుతూ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇది మంచి భరోసా. ఇది ఆచరణలో నిజం కావాలంటే తదుపరి ఎన్నిక కాబోయే ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

కోటి ఉద్యోగాలు కల్పించారా?
భాజపా అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను అందిస్తుందని గత లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ తెలిపారు. తాము చెప్పినట్టే గత ఆర్థిక సంవత్సరానికి దేశంలో కోటి ఉద్యోగాలు సృష్టించినట్లు ప్రధాని తెలిపారు. తాజాగా ఒక స్వతంత్ర సంస్థ ఆ సర్వే వివరాలను ప్రస్తావించింది. తమ వాదనకు బలం ఉందనడానికి ఇపిఎస్, ఎన్‌పిఎస్, అధికారిక, అనధికారిక రంగం సహా పలు వ్యవస్థల్లో అందుబాటులో ఉపాధి మార్గాలను సూచించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైన వాస్తవాన్ని ప్రధానమంత్రికి, ఆయన ప్రభుత్వానికి బాగా తెలుసునని ప్రతిపక్షాలు ఎలుగెత్తి చాటాయి. హామీలను నెరవేర్చనందున రాబోయే ఎన్నికలలో భాజపా తగిన మూల్యం చెల్లించక తప్పదని విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో చేసిన మిగతా వాగ్దానాలను సైతం నెరవేర్చడంలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని విపక్షనేతలు ఆరోపించారు. కేవలం గత ఏడాది ఉపాధి పొందిన వారి సంఖ్యను ప్రకటించి, అన్ని ప్రతిపక్షాలు ప్రధానమంత్రిని వేలెత్తి చూపుతున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకూ ఏ రంగంలో ఎంతమంది ఉపాధి పొందారో గణాంకాలను అధికారికంగా ప్రకటిస్తే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ఎవరిది తప్పుడు ప్రచారమో వెల్లడవుతుంది. ప్రధానమంత్రి ప్రకటన పట్ల ప్రజల్లో అనుమానం తొలగుతుంది.
-సీవీఆర్ కృష్ణ, హైదరాబాద్.