ఉత్తరాయణం

వివాదాస్పద వ్యాఖ్యలు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వర్గాన్నో, మతాన్నో లక్ష్యంగా చేసుకుని కుత్సిత విమర్శలు చేసేవారు ఎంత ఉన్నత విద్యలు అభ్యసించినా, మేధావి అనిపించుకోలేరు. విద్య వినయానే్న నేర్పుతుందని చెబుతారు. కానీ విద్యాధికుడు కంచ ఐలయ్య ప్రచురించిన పుస్తకాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. కొందరు స్వాములు, కొన్ని వర్గాలపై ఆయన కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేశారు. చర్చాగోష్ఠిలో స్వామీజీ దీటైన సమాధానం చెప్పకుండా మధ్యలో వెళ్లిపోవడం బాధాకరం.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
బ్లూవేల్ ఆటకట్టించాలి

బ్లూవేల్ గేమ్‌కు అలవాటుపడిన యువత ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. స్మార్ట్ఫోన్‌లో వారు ఆడుతున్న రాక్షసక్రీడకు అడ్డుకట్ట వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేయాలి. ముఖ్యంగా చిన్నారు, యువతరం ఈ ఆటపట్ల ఆకర్షితులు కాకుండా పెద్దలు వారికి జాగ్రత్తలు ముందే చెప్పాలి. ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి క్రీడలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఎల్.ప్రపుల్లచంద్ర, ధర్మవరం
ఎన్టీఆర్ బయోపిక్‌పై అభ్యంతరమా?
ప్రజాదరణ పొందిన నటుడు, రాజకీయ నేత ఎన్.టి.రామారావు జీవిత చరిత్రపై రామ్‌గోపాల్‌వర్మ సినిమా తీస్తానంటే ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ అభ్యంతరం చెప్పడంలో అర్ధం లేదు. వారికి నచ్చినదే తీయాలంటే ఎలా? ఆ చిత్రం స్క్రిప్ట్ ముందు చూపించాలని, తమ అనుమతి ఉండాలని అనడం అవివేకం. మండలాధీశుడు, నా పిలుపే ప్రభంజనం లాంటి సినిమాలకు రాజేంద్రప్రసాద్ అప్పట్లో అనుమతి ఇచ్చాడా? మహాభారతం, రామాయణాన్ని చాలామంది వారివారి దృష్టితో, కోణాల్లో కొన్ని సన్నివేశాలనే సినిమాలుగా తీశారు. అది దర్శకుడి ఇష్టం, ప్రతిభనుబట్టి ఉంటాయి. మధ్యలో వారికి అభ్యంతరాలు ఎందుకు?
-టి.చక్రపాణి, ఏలేశ్వరం
ఆర్టీసి చెలగాటం
ఆంధ్రప్రదేశ్‌లోని అవనిగడ్డ ఆర్టీసి డిపోకు చెందిన బస్సు ప్రమాదానికి గురై ఆరుగురి ప్రాణాలను బలిగొంది. ఇటీవల జరిగిన ఈ ప్రమాదానికి అసలు కారణం తెలుసుకోవాలి. ఒకే డ్రైవరును నియమించి సామర్థ్యానికి మించి పనులు చేయించడంవల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అవనిగడ్డ బస్సుల్లో టిక్కెట్లు అమ్మి, నడుపుతున్నది ఒక్కరే. స్వయంగా అలా పనిచేస్తున్న సిబ్బందిని, బస్సులను చూశా. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, వెంటనే తగిన సిబ్బందిని నియమించాలని మనవి.
-జొన్నాభట్ల నరసింహ ప్రసాద్, నాగారం