ఉత్తరాయణం

హామీల అమలులో వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు ప్రజలంతా ముక్తకంఠంతో పోరాడుతుంటే, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలలో 85 శాతం అమలు చేశామని ఘనంగా ప్రకటించుకున్నారు. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా తప్పులతడకగా వున్న అఫిడవిట్‌ను దాఖలు చేసి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. తిరుపతి ఐఐటీకి, తాడేపల్లిగూడెం ఎన్‌ఐటికి కూడా నిధులు విడుదల చెయ్యకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ ద్వారా రుణం ఇప్పిస్తామని ప్రకటించడం తెలుగు ప్రజలను మరొకసారి మోసం చేయడమే. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 11 కేంద్ర విద్యా సంస్థల నిర్మాణానికి మూడు వేల వంద కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉండగా, గత నాలుగేళ్లలో కేవలం 99 కోట్లు మాత్రం ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకొంది. కొత్త రాష్ట్రానికి చేయాల్సిందంతా చేశామని ప్రకటించి మిగతా నిధుల కోసం అప్పుల బాట పట్టమని సలహా ఇవ్వడం- రాష్ట్రాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే. అత్యున్నత విద్యా ప్రమాణాల కోసం భారీగా నిధులు ఖర్చుచెయ్యవలసి వున్న విద్యాసంస్థలను అప్పులు చేసి నిర్మాణం చేయవలసి రావడం తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. మరొక వైపు అయిదు కేంద్ర విద్యా సంస్థల నిర్మాణం నిధులు లేక ఆగిపోగా, ఎన్‌డిఏ పాలిత రాష్ట్రాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త విద్యాసంస్థల నిర్మాణాలు కేంద్రం ఉదారంగా ఇచ్చిన నిధులతో శరవేగంగా సాగుతుండడం మోదీ సర్కారు అవకాశవాద రాజకీయాలకు తిరుగులేని నిదర్శనం. అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న దక్షిణ మధ్య రైల్వే పట్ల రైల్వే శాఖ సవతి తల్లి ప్రేమ కనబరుస్తూనే వుంది. నడికుడి-బీబీనగర్ మధ్య అదనపు రైల్వే లైను, కాకినాడ-పిఠాపురం, రాజమండ్రి-్భద్రాచలం మధ్య నూతన రైల్వే లైను, దువ్వాడ-విశాఖ మధ్య అదనపు రైల్వే లైను, విజయవాడలో ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ, తిరుపతిలో అత్యాధునిక వసతులతో రైల్వే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, ఇరవై రెండు రైల్వే స్టేషన్ల అభివృద్ధి వంటి ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపి దశాబ్దాలు కావస్తున్నా, ఇంతవరకు నిధులు కేటాయించని కారణంగా అవి పట్టాలెక్కలేదు. 65 శాతం రైళ్లు పొరుగు రాష్ట్రాల నుండి వస్తున్నవి కావడంతో- విశాఖ, విజయవాడ, శ్రీకాకుళం, అనంతపూర్ వంటి ప్రాంతాల నుంచి దేశంలో ఇతర ముఖ్య పట్టణాలకు వెళ్ళే విధంగా పదహారు సూపర్‌పాస్ట్ రైళ్ళను ప్రవేశపెడతామని 2014లో ఎన్నికల ముందు బిజెపి ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకాలేదు. ఆంధ్రుల ఆకాంక్ష అయిన ‘విశాఖ రైల్వే జోన్’ హుష్‌కాకి అయిపోయింది.
-సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం