ఉత్తరాయణం

తిరుమల షేర్ మార్కెట్ కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలలో శ్రీవారి హుండీ ద్వారా ఎంత ఆదాయం లభిస్తున్నదీ కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు రోజువారీగా ప్రకటిస్తూ ఉండటం ఎంత మాత్రమూ సమంజసం కాదు. అధికంగా కానుకలు వస్తే భక్తి ఎక్కువగా ఉన్నట్లు, ఆదాయం తగ్గితే భక్తి సన్నగిల్లినట్టుగా మీడియా కథనాలు వస్తున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రం వ్యాపార కేంద్రం కాదు. ఏదో షేర్ మార్కెట్ వివరాలు ప్రకటిస్తున్నట్లుగా ఉంది మీడియా వ్యవహారం. ఆరునెలలకో, ఏడాదికో ఒకసారి ఆదాయ వివరాలు ప్రకటిస్తుంటే బాగుంటుంది. ప్రపంచంలో ఇతర ఏ దేవాలయమూ లేదా ఇతర మతాల ప్రార్థనాలయాలు వారి వారి ఆదాయ వివరాలు రోజువారీగా ప్రకటించవు. రోజువారీగా ఆదాయ వివరాలు ప్రకటించడం విరమించుకొని తిరుమల పవిత్రతను కాపాడుకోవాలని మనవి.
- ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్