ఉత్తరాయణం

బాబాలను బహిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాన్య పౌరుల బలహీనతల ఆసరాగా దొంగబాబాల ఆటలు సాగుతున్నాయి. డేరాబాబా, ఫలహార్ బాబా వంటి వారి బయటకు వచ్చాయి. కానీ ఎక్కడికక్కడ దొంగబాబులు ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు. నిజమైన బాబాలు, స్వామీజీలు చెప్పే ప్రవచనాల్లో మంచిని స్వీకరిస్తే చాలు. ప్రజలు వారిని గమనించి అనుసరించాలి. అంతేగానీ వారు చేసే మాయలు చూసి నమ్మితే మోసపోకతప్పదు. కాషాయ దుస్తులు ధరించి గెడ్డం పెంచినంత మాత్రాన వారు నిజమైన స్వామీజీలు అనుకోవడం కేవలం భ్రమ. ఎంతో నమ్మకంతో నమ్మినవారిని నట్టేట ముంచే బాబాలను సంఘ బహిష్కరణ చేయాలి.
-జి.అశోక్, గోధూర్
దుస్థితిలో మల్కాపురం రోడ్డు
జాతీయ రహదారి 65పై ఉన్న బాటసింగారం గ్రామం నుంచి మల్కాపురానికి వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా పాడైంది. రోడ్డుపై ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డాయి. వాహనాలు వెళ్లిరావడం కష్టంగా ఉంది. ఇక ప్రయాణికుల అవస్థలు చెప్పనలవికాదు. వెంటనే ఈ రహదారిని బాగు చేయాలి.
-ఎస్.ఎస్.రాజు, వనస్థలిపురం
ఆత్మహత్యలపై దర్యాప్తు అవసరం
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మంత్రికి చెందిన విద్యాసంస్థలలో ఇటీవలి కాలంలో జరుగుతున్న ఆత్మహత్యల సంఘటనలు అనుమానాలకు తావిస్తున్నాయి. కృష్ణాజిల్లా గూడవల్లిలోని ఒక విద్యాసంస్థలో ఈశ్వరరెడ్డి మృతి అలాంటిదే. ఒక మంత్రికి చెందిన ఆ విద్యాసంస్థలో జరిగిన సంఘటనపై ఆయన బంధువైన మరోమంత్రి దర్యాప్తునకు అర్ధం ఏముంటుంది. ఆయా విద్యాసంస్థలపై ఎంతో నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న విద్యార్థినీవిద్యార్థులకు రక్షణ ఎక్కడ ఉంది. వారి భద్రత, భవిష్యత్‌కు ఆ విద్యాసంస్థలు పూచీ పడాలి. సరైన దర్యాప్తు జరిపించినప్పుడే ఆ సంస్థలకు మంచిపేరు దక్కుతుంది.
-జి.బాలకృష్ణారెడ్డి, అనపర్తి
వ్యవసాయాన్ని నమ్ముకోవాలి
చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం లేదు. అందరూ ఉద్యోగం చేయాలని అంతకన్నా లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలంటూ పరుగు తీయకుండా వ్యవసాయ రంగంలోకి నిరుద్యోగ యువత అడుగుపెట్టాలి. మొదట్లో కష్టమైనా వ్యవసాయం వల్ల కడుపునిండుతుంది. కాయకష్టం చేసి పంట పండిస్తే వచ్చే సంతృప్తి మరే వ్యాపకంలోనూ రాదు. నిరుద్యోగ యువత ఎండమావులకోసం ఎదురుచూడకుండా పుడమిని నమ్ముకుంటే మంచిది.
-కనిగిరి వీరభద్రం, విశాఖపట్నం