ఉత్తరాయణం

రోహింగ్యాలను పంపేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయన్మార్ నుంచి అక్రమంగా దేశంలోకి వస్తున్న రోహింగ్యా ముస్లింలను మన దేశం నుంచి పంపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓట్ల కోసం వారికి పునరావాసం కల్పించాలని, భారత్‌లో ఉండేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ పక్షాలకు బుద్ధి చెప్పాలి. రోహింగ్యాలకు మద్దతుగా మనదేశంలోని ముస్లింలు ర్యాలీలు చేయడం, వామపక్షాలు మద్దతు ఇవ్వడం దేశభద్రతకు ముప్పు తేవడమే. ఓట్లకోసం ఇప్పటికే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అక్రమ ప్రవేశకులకు ఆధార్, రేషన్‌కార్డులు వచ్చేలా చేసింది. ఇది అన్యాయం. ఈ విషయంలో ఏకాభిప్రాయంతో అన్ని రాజకీయ పక్షాలు వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

-ఉల్లి బాలరంగయ్య, కడప

నిర్మల ‘నమస్తే’ దౌత్యం

భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తనదైన శైలితో సిక్కిం సరిహద్దు పర్యటనకు శోభతో పాటు విజయాన్ని తీసుకువచ్చారు. సరిహద్దుల్లో కొన్ని నెలలుగా చైనా, భారత్‌ల మధ్య వివాదం రగులుతోంది. ఈ పరిస్థితుల్లో భారత రక్షణ మంత్రి ఆ ప్రాంతాన్ని సందర్శించడమంటె మన దేశ సైనికులకు ఆత్మస్థైర్యం ఇవ్వడమే. అదే సమయంలో చైనాని పరోక్షంగా కవ్వించడంగా వారు భావిస్తారు. మరింతగా బిగుసుకుంటారు అనివార్యంగా. అయితే నిర్మలాసీతారామన్ అక్కడి సైనికులతో కూడా నమస్కారం అంటూ కలసిపోయారు. ఈ చర్యతో వారిపట్ల సుహృద్భావమే తప్ప శత్రుభావన లేదన్న సంకేతం వెలిబుచ్చినట్లైంది. కయ్యము, నెయ్యము నెరిపే సందర్భంలో ఇరువర్గాలు బిగుసుకుని ఉండనక్కరలేదని, పరస్పర గౌరవంతో తమ ప్రయత్నాలు చేసుకునే హుందాతనం ఉండాలని ప్రపంచానికి చెప్పినట్లయింది. భారత్ గౌరవాన్ని పెంచడమే కాకుండా ప్రత్యర్థి మనసు గెలిచినట్టయింది. నమస్తే దౌత్యంతో నిర్మల ప్రజల మనసు గెలిచారు.

-డి.వి.జి.శంకరరావు, పార్వతిపురం

పరిజ్ఞానం లేని బోధన

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల విద్యాబోధన చేయాలన్న తాపత్రయం మంచిదే. కానీ ఆంగ్లాన్ని బోధించే ఉపాధ్యాయులకు ఆ భాషపై పట్టు లేకుండా ఉంది. పరిజ్ఞానం లేని వారు పిల్లలకు నేర్పేది ఏముంటుంది. నిజానికి ఆంగ్లంలో తప్పుల్లేకుండా మాట్లాడగలిగే స్థాయి కూడా ఉపాధ్యాయులకు ఉండటం లేదు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. విద్యార్థులకు పుస్తకాల బరువు పెరగకుండా చూడాలి.

-ఆర్.కృపాచార్య, విశాఖపట్నం