ఉత్తరాయణం

‘విద్య’లో నకిలీల విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు విద్యారంగానికీ నకిలీల బెడద వ్యాపించడం సిగ్గుచేటు. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన మన దేశానికి సైతం ఈ వైపరీత్యం సోకడం ఎంతో బాధాకరం. నేటి చదువుల్లో డొల్లతనం- విద్యాప్రమాణాలు దిగజారిపోవడానికి, పాలకుల వైఫల్యానికి దర్పణం. ఎంతో విలువైన డిగ్రీ సర్ట్ఫికెట్లను చిత్తుకాగితాల లెక్కన అమ్మి సొమ్ముచేసుకోవడం, అత్యున్నత విద్యాలయాల్లో సైతం ఈ దందా నిరాఘాటంగా సాగడం వ్యవస్థలోని లొసుగులను చెప్పకనే చెబుతోంది. ఎంతో సమయం వెచ్చించి నిరంతరం కృషిచేస్తేనే కాని రాని పిహెచ్‌డి, ఎంటెక్ సర్ట్ఫికెట్లు ఈరోజు అంగడిలో డబ్బిస్తే కొనుక్కునే్న పెన్నో, పెన్సిల్ చందాన మారడం ప్రభుత్వాల వైఫల్యం. విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వాల చిన్నచూపును ఇది ఎత్తిచూపిస్తోంది. కొందరు గురువులు అడ్డత్రోవలు తొక్కడం సమాజానికి పట్టిన గ్రహణం. ఒక సర్వే ప్రకారం- పలు విద్యాలయాలలో రెండువందల మంది అధ్యాపకులు, నలభై మంది ప్రిన్సిపాళ్ళు, నకిలీ సర్ట్ఫికెట్లతో ఉద్యోగాలు పొందారన్న గణాంకాలు విద్యాశాఖ ఒక్క నిష్కృయాపరత్వానికి ప్రత్యక్ష తార్కాణం. ఈరోజు డబ్బులు పారేసి ఇంటి నుండే ఏ రాష్ట్రానికి చెందిన విద్యాసంస్థల నుంచైనా పట్టాలు పొందుతున్నారంటే నకిలీ విద్యావ్యవస్థ ఊడలు ఎంతవరకూ విస్తరించాయో అర్థం చేసుకోవచ్చు. బ్రోకర్లు భారీగా డబ్బు దండుకొని, పిహెచ్‌డి సర్ట్ఫికెట్లు సంపాదించి పెడుతున్నారన్న విషయం జీర్ణించుకోలేనిది. ఈ దుర్వ్యవస్థ వైద్యవిద్య, సిఎస్‌ఐఆర్ వంటి పరిశోధనాలయాలకు పాకడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ఠ. నకిలీ సర్ట్ఫికెట్లతో కొందరు డాక్టర్ల అవతారం ఎత్తి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడడం, ప్రొఫెసర్లుగా విద్యార్థులకు జ్ఞానభిక్ష పెట్టడానికి ప్రయత్నించడం ఏమాత్రం సహించరాని విషయం. కేంద్ర ప్రభుత్వం నిరుడు దేశవ్యాప్తంగా 279 సాంకేతిక కళాశాలలు, 29 బోగస్ విశ్వవిద్యాలయాలు వున్నట్లు అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత కూడా నకిలీ విద్యావ్యాపారం కొనసాగుతుండడం దారుణం. ప్రాథమిక విద్యారంగం పరిస్థితి అధ్వానంగా వుందనుకుంటే ఉన్నత విద్యారంగం కూడా అందుకు భిన్నంగా లేకపోవడం తెలివైన విద్యార్థుల పట్ల శాపంగా మారుతోంది. ఉన్నత విద్యారంగానికి పరిపుష్టి కల్పించాల్సిన యుజిసి, జాతీయ ఉన్నత విద్యా కమిషన్‌లు ఈ నకిలీ బాగోతానికి సాక్షీభూతంగా నిలవడం దురదృష్టకరం.
-సి.కనకదుర్గ, హైదరాబాద్