ఉత్తరాయణం

‘చంద్ర’ భ్రమణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలంగా ఏపీ రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైన ‘చంద్రుడు’ కక్ష్యను దాటి జాతీయ కక్ష్యలోకి ప్రవేశించి పరిభ్రమణం చేయసాగాడు. గతంలో యునైటెడ్ ఫ్రంట్, వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే రోజుల్ని తలచుకొంటూ, తలపిస్తూ వేగంగా కదులుతూ వివిధ గ్రహాల్ని తాకుతూ ‘చంద్రయానం’ కొనసాగుతోంది. 2014 సంవత్సరానికి ముందు కేంద్రంలో వైరిపక్షాలు అధికారంలో ఉండడం వల్ల కొంతకాలం వెలుగులు మసకేసినా, ఆ తరువాత మిత్రుడు నరేంద్ర మోదీ- ‘మిత్రుల అవసరం లేని’ పూర్తి కళలతో హస్తినలో తిష్టవేయడంతో రాష్ట్ర పరిధి దాటి భ్రమణ, పరిభ్రమణాలు అంతగా అవసరం పడలేదు. కానీ చంద్రుడికి నమ్మిన సూ ర్యుడే గ్రహణం పట్టించినట్టు.. మోదీతో స్నేహం చెడి ఎన్నికలకు ముందే దారులు మారాయి. చంద్ర, నరేంద్ర వైరంలో కక్ష్యలేవైనా- చంద్రుడి లక్ష్యం ఒక్కటే మిగిలింది. అది నరేంద్ర వ్యతిరేక కూటమి. కమలాన్ని నమలి మింగేసంత కోపంతో ఇక పొత్తుల్ని సాధించడమే తరువాయి. అందులో ఆయనకు అవసరమైనంత అనుభవం ఉంది కూడా. లేనిదల్లా ప్రస్తుతానికి అనుకూల వాతావరణం. హస్తిన వెళ్లి చిరకాల వైరి ‘హస్తం’ అందుకున్నారు. ఆపై వెళ్లింది- అదే హస్తం భుజాలపై ఊరేగుతున్న కుమారస్వామి దగ్గరకు. అటునుంచి ఎటూ కమలానికి రెండాకుల దూరంలో ఉన్న కరుణ కుమారుడి దగ్గరకు. పనిలో పనిగా ఏనుగును, సైకిల్‌ని చూసొచ్చినా, అవి హస్తిన వైపు పరుగు కన్నా లక్నోలోని పరుగుపందెం పైనే పెట్టే దృష్టి ఎక్కువ. నవీన్, మమత, లాలూ డిటో డిటో. వెరసి గట్టిగా కమల దళానికి శత్రువుగా నిలిచేది కాంగ్రెస్ ఒక్కటే ప్రస్తుతానికి. మిగతా గ్రహాలు ఒక స్థిరకక్ష్యకు లోబడి తిరిగేవి కావు.. ఊహించిన మేరకే ఫలితాలు వచ్చేందుకు. పైగా ఏవీ ఉపగ్రహాలు కావు.. ఒక గ్రహానికే కట్టుబడడానికి. సింహాసనం కోరే రాజులెక్కువ, సైనికులు తక్కువ. యుద్ధం, మోహరింపులు, బలాబలాలు వాటి ఫలితాలు అన్నీ ఆసక్తిదాయకమే ఈసారి.
-డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం