ఉత్తరాయణం

సీబీఐ వర్సెస్ సీబీఎన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీబీఐపై తమకు ఎలాంటి విశ్వాసం లేదని ప్రకటిస్తూ, తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తులకు రాష్ట్ర అనుమతిని రద్దు చేయడం సంచలన నిర్ణయం. ఈ మేరకు అధికారికంగా ప్రభుత్వ ఆదేశం వెలువడింది. సీబీఐపై ఎవరైనా విశ్వాసం కోల్పోవడంలో వింత చెందాల్సింది ఏమీలేకున్నా, దాని ముందరికాళ్లకు బంధాలు వేయాలని భావించడం మాత్రం తీవ్ర నిర్ణయమే. దేశానికి గర్వకారణమైన ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ సామర్థ్యంపై ఎవరికీ అనుమానం లేదు. అయితే దానికి స్వతంత్రత లేకపోవడమే పెద్ద లోపం. కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షానికి అనుకూలంగా పనిచేయాల్సి వస్తూ దాని గౌరవాన్ని తగ్గించుకొంది. ఉన్నతాధికారుల మధ్య అవినీతి ఆరోపణలతో అంతర్యుద్ధం మరొకటి. అందుకనే దాన్ని పంజరంలో చిలుకగా సుప్రీం కోర్టు అభివర్ణించింది. అయితే ఎంతటి పంజరంలో చిలుకైనా మా మందిరంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆదేశించడం సబబు కాదు. అది ఆ సంస్థ ప్రతిష్టని మరింత పలుచన చెయ్యడమే తప్ప దీనివల్ల ఉపయోగం తక్కువే. కేంద్రం తమపై కక్ష సాధిస్తోందని రాష్ట్రం భావిస్తే దాన్ని అంశాల వారీగా ఎదుర్కోవాలి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలో సర్కారియా కమిషన్, రాజ్యాంగం చెప్తున్నాయి. ఏదైనా సంస్థను దుర్వినియోగం చేయడం ద్వారా కేంద్రం తప్పుచేస్తే ఆ అంశంపై ప్రజామద్దతు కూడగట్టాలి. వివిధ వేదికలపై పోరాడాలి. అలాకాకుండా ఒకే దెబ్బగా ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల దుష్పరిణామాలే ఎక్కువ. అస్తవ్యస్తంగా తయారై ఉన్న దర్యాప్తు సంస్థకి స్వతంత్రత, సమర్ధత చేకూరేలా సుప్రీం మార్గం చూపాలి. శాసన వ్యవస్థ పాటించాలి. రాజకీయ గమ్యాలు చేరుకోవడానికి రాజ్యాంగ సంస్థల్ని వాడుకోవడమంటే ఎక్కిన కొమ్మని నరుక్కోవడమే. వ్యవస్థని పాడుచెయ్యడమే.

- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం