ఉత్తరాయణం

నైపుణ్యాభివృద్ధిలో వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ నైపుణ్య సూచీలో మనదేశం గత రెండేళ్ళలో రెండు ర్యాంకులు దిగజారి, మొత్తం 63 దేశాల పట్టికలో 55వ స్థానంలో వుందన్న స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ తాజా నివేదిక ఘోషిస్తోంది. మన దేశంలో యువతలో నైపుణ్యత కొరత, మానవ వనరుల అభివృద్ధిలో పథకాల వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. యువశక్తిని అభివృద్ధి చేయడంపైనే దేశ అభివృద్ధి ఆధారపడుతుందని వందేళ్ళ క్రితమే ప్రకటించిన స్వామి వివేకానందుని ఆశయాలను, దిశానిర్దేశాన్ని తుంగలోకితొక్కిన మన ప్రభుత్వాలు రాజకీయ విన్యాసాలలో క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నాయి. యువశక్తి నైపుణ్య అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం క్షమార్హం కాదు. జీడీపీలో ఆరు శాతానికి పైగా విద్యారంగం, మానవ వనరుల అభివృద్ధికి కేటాయిస్తున్న స్విట్జర్లాండ్, నార్వే, ఫిన్లాండ్, జర్మనీ వంటి దేశాలు వరుసగా ఆరవసారి తొలి అయిదు స్థానాలలో నిలబడగా నూట ముప్పై కోట్ల జనాభా కలిగి, అందులో 50 శాతం పైగా యువత కలిగిన మనదేశం మాత్రం రెండు శాతంకంటే తక్కువ బడ్జెట్ కేటాయిస్తూ తీవ్ర అలక్ష్యవైఖరి కనబరుస్తోంది. విద్యాప్రమాణాల నాణ్యత, విద్యారంగంలో వౌలిక సదుపాయాల అంశాలతో పై దేశాలలో, మనకు హస్తిమశకాంతర బేధం వుంది. ‘స్కిల్ ఇండియా’ పథకం పేరిట ఏటా లక్షల కోట్లు వ్యయం చేస్తున్న మన ప్రభుత్వాలు కనీస ఫలితాలను ఎందుకు సాధించలేక పోతున్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం వుంది. భారత కార్మికులతో పోలిస్తే అమెరికా, సింగపూర్‌లోని కార్మికులు పదిరెట్లమేర అధిక ఉత్పాదకత నమోదు చేయడానికి కారణం ఆయా దేశాలలో పటిష్ట నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలో అంటే అతిశయోక్తికాదు.
-సిహెచ్. ప్రతాప్, శ్రీకాకుళం