ఉత్తరాయణం

కేసీఆర్ ‘గిఫ్ట్’తో బాబుకు లాభమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెరాస అధినేత కేసీఆర్ తాను చంద్రబాబుకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తాననడం ఏ రకంగా చూసినా మంచిదే. ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కేసీఆర్ ఇప్పుడు ‘అప్‌డేటెట్ వెర్షన్’లా కనిపిస్తున్నారు. ‘రోబో’ సినిమా కన్నా ‘రోబో 2.0’పై సహజంగా అంచనాలు ఎక్కువ. విజువల్ ఎఫెక్టులతో ‘2.0’ సినిమా ప్రేక్షకులను అలరించినట్టు- తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వరకూ విజువల్ ఎఫెక్టులు ఎక్కువే ఉంటాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత తన పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పిన కేసీఆర్ దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని అమలు చేయాలనడం హర్షణీయం. ఇదే సందర్భంగా ఆయన ‘చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా..’ అని వ్యాఖ్యానించడం ఆసక్తికరం. గతంలో గెలిచాక ఆయన తిరుపతి, విజయవాడ వెళ్లి మొక్కులు చెల్లించారు. అదే విధంగా ఇపుడు ఎన్నికల్లో గెలిచినందున ఆంధ్రప్రదేశ్‌లోనూ పర్యటిస్తానని, చంద్రబాబుకు బహుమతి ఇస్తానని అన్నారు. ఆ బహుమతి ఎలా ఉంటుందో ఎవరి ఊహకూ అందడం లేదు. గతంలో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ‘కొంచెం నీరు, కొంచెం మట్టి’ తన వెంట తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానుకగా ఇచ్చారు. మరి కేసీఆర్ ఏ రూపంలో బహుమతి పట్టుకొచ్చి ఆంధ్రాలో పర్యటిస్తారో చూడాల్సిందే. రాజకీయ వ్యూహంలో భాగంగా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సభల్లో పాల్గొన్నా అది చంద్రబాబుకు వరమే అవుతుంది. కేసీఆర్ పర్యటిస్తే ఆంధ్రాలో మరోసారి ‘సమైక్యాంధ్ర’ సెంటిమెంటు వేడి పుట్టిస్తుంది. దాని వల్ల చంద్రబాబుకు లాభమే తప్ప నష్టం ఉండదు. గతంలో లేని విధంగా కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారు. అందుకు తగ్గట్టు ఉత్తమ పాలనతో ఆయన ప్రజలను మెప్పించాలి. జాతీయ స్థాయిలో ఎదగాలన్న ఆకాంక్షను నెరవేర్చుకుంటూనే తెలంగాణ ప్రజల ఆశలు తీర్చడం కేసీఆర్‌కు పెద్ద బాధ్యతే. ‘మంచి పాలన’ అనే బహుమతిని తెలంగాణ వాసులకు కేసీఆర్ ఇవ్వాల్సి ఉంది.
- డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం