ఉత్తరాయణం

*సీరియస్ మేటర్‌లో ‘సిల్లీ మిస్టేక్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాదాస్పదమైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత సహజంగా కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ అంశం పాలక బీజేపీని ప్రజలముందు దోషిగా నిలబెట్టే రాజకీయ ఆయుధంగా తయారైంది. సుప్రీం తన తీర్పు ద్వారా రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందనడానికి ఏ ఆధారాలూ లేవని, అనుమానాల ప్రాతిపదికన దర్యాప్తుని ఆదేశించలేమంటూ కాంగ్రెస్ ఆశలపై నీళ్లు కుమ్మరించడంతోపాటు, ఉక్కిరిబిక్కిరిలోనున్న బీజేపీ నెత్తిపై పాలుపోసింది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రజల్ని తప్పుదోవ పట్టించినందుకు ‘సారీ’ చెప్పాల్సిందేనంటూ బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టి కుదురుకొనే లోగానే మళ్ళీ మరో అంశం కాంగ్రెస్ చేతికి అందివచ్చింది. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు లెక్కల్ని ‘కాగ్’ పరిశీలించి, ప్రజాపద్దుల కమిటీ ముందు ఉంచిందని సుప్రీం తీర్పు ద్వారా వెల్లడైన వ్యాఖ్యలో నిజం లేదని, ప్రభుత్వం కోర్టుని తప్పుదోవ పట్టించడంతో అలా భావించడం జరిగిందంటూ, తద్వారా తీర్పుపై ప్రభావం పడిందంటూ చెప్తోంది. అందుకు ప్రభుత్వం నుండి వచ్చిన వివరణే అసంబద్ధం. ప్రభుత్వం తానిచ్చిన వివరణలో జరిగిన ‘గ్రామర్’ (వ్యాకరణ దోషం) పొరపాటుని కోర్టు వేరేలా అర్థం చేసుకొంది అంటూ ఆమేరకు కోర్టుకి విన్నవించింది- సరైన అర్థం ఇదంటూ. ‘కాగ్’ లెక్కలు చూశాక, ప్రజాపద్దుల సంఘం, అటు పిమ్మట పార్లమెంటు చూస్తాయంటూ ఆనవాయితీగా పాటించే పద్ధతిని వివరించిందట! న్యాయస్థానమేమో ఆ లెక్కలు వారంతా ‘చూసేశారు’ అని అర్థం చేసుకొందట. అదీ తిరకాసు. ప్రభుత్వం వివరణను న్యాయస్థానం ఎలా తీసుకొంటుందో తెలియదు కానీ- ‘మరీ అంత సిల్లీ మిస్టేక్ ఇంత సీరియస్ మేటర్‌లోనా?’ అన్నది సగటు భారతీయుని డౌటు. రాఫెల్ యుద్ధవిమానాలు దేశానికి ఎంత అవసరమో, వాటి ధరలపై అవకతవకలు జరిగాయో లేదో ఆ విషయాలన్నీ అటుంచండి. అసలు ఈ ఒప్పందంలో భాగంగా సంబంధిత రంగంలో అనుభవం ఉన్న హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే ప్రఖ్యాత ప్రభుత్వరంగ సంస్థకి రావాల్సిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దాని చేజారి ఏమాత్రం అనుభవం లేని, అప్పుల్లోఉన్న సరికొత్త ప్రయివేట్ సంస్థకి రావడంలో ఆంతర్యం ఏమిటి? పోనీ అలా దేశీయ భాగస్వామిని ఎన్నుకోవడం అన్నది ఒప్పందం చేసుకొన్న విదేశీ సంస్థ ఇష్టం అనుకొన్నా ప్రభుత్వం తరఫునా, దేశం తరఫునా ప్రభుత్వరంగ సంస్థని సిఫార్సు చెయ్యాల్సిన బాధ్యత ‘మేక్ ఇండియా’నినాదాన్ని తలకెత్తుకొన్న ఈ పాలకులకు లేదా? ఈ ప్రశ్నలకు మాత్రం ప్రభుత్వం జవాబులను బాకీ ఉంది.
- డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం