ఉత్తరాయణం

సీబిఐకి చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన మైనర్ బాలిక ఆరుషి హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు వెలువరించిన తీర్పు సిబిఐ సంస్థకు చెంపపెట్టు. క్రింది కోర్టు దోషులుగా నిర్ధారించిన ఆరుషి తల్లిదండ్రుల్ని సంశయలాభం ప్రాతిపదికన హైకోర్టు విడుదల చేసింది. అంటే నేరం నిరూపించే విషయంలో దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయన్న మాట. ఒక నేర పరిశోధనకు అవలంబిచాల్సిన శాస్ర్తియ పద్ధతులు పాటించలేదన్నమాట. ‘పరిస్థితులు చెప్పే సాక్ష్యం’ ఆధారంగా కింది కోర్టు,ఆమె తల్లిదండ్రులే దోషులన్న భావనకు వచ్చినా, తిరుగులేని సాక్ష్యాధారాలు లేకపోవడం పైకోర్టు గమనంలోకి తీసుకుంది. ఒక్క నిరపరాధి కూడా అకారణంగా శిక్షకు గురికాకూడదన్న న్యాయ సూత్రానికి అనుగుణంగా తీర్పునిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందించబోతున్నదో అన్న విషయాన్ని పక్కనపెట్టినా, ఇంతవరకు తేటతెల్లమైన విషయం మాత్రం.. దర్యాప్తు సంస్థల తిరుగులేని వైఫల్యం. ఆధునిక పరిజ్ఞానమూ, వనరులూ అందుబాటులో ఉన్నా ఒక సంచలన అమానవీయ నేరాన్ని ఛేదించి, నిరూపించలేకపోవడం అన్యాయం. అతి తక్కువ కేసుల్లో శిక్షలు పడడం, అదీ కొన్ని దశాబ్దాల తరువాతనే కావడం అన్నది దేశ నేర న్యాయవ్యవస్థ పరిష్కరించుకోవలసిన ముఖ్య సమస్య.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
ఆకలిని తరిమికొడదాం
అభివృద్ధి చెందుతున్న మనదేశంలో ఇప్పటికీ ఆకలితో అలమటిస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువ. ప్రపంచ ఆహార విధాన పరిశోధన సంస్థ ప్రకటించిన ప్రపంచ ఆకలి సూచిలో మన దేశం 199 దేశాల్లో వందవ స్థానంలో ఉండటం విచారకరం. పిల్లలకు పోషకాహారం, సమతుల్య ఆహారం లేక బరువు తక్కువగాను, విటమిన్ల లోపంతోను బాధపడుతున్నవారి సంఖ్య కోట్లలో ఉంది. మన ఇరుగుపొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, ఉత్తర కొరియా, నేపాల్, చైనా, ఇరాక్ మయన్మార్ వంటి దేశాలు మనకన్నా మెరుగైన స్థితిలో ఉండటం విశేషం. పౌష్ఠికాహారం లేక ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు మనదేశంలో అత్యధికం. ఈ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి పేదరికాన్ని రూపుమాపాలి.
-కె.శ్రవణ్‌కుమార్, ఎర్రబెల్లిగూడెం
మహిళా రిజర్వేషన్ల ప్రహసనం
రాజకీయాల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మరోసారి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి ప్రస్తావించడం హాస్యాస్పదం. యుపిఎ హయాంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఏమయిందో అందరికీ తెలిసిందే. దశాబ్దాలు గడిచినా ఫలితం లేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాష్టప్రతి ప్రతిభాపాటిల్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అధికారంలో ఉండగా మహిళాబిల్లును ఆమోదింపచేసేందుకు ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ ఈ అంశాన్ని ప్రస్తావించడం ప్రహసనమే.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్