ఉత్తరాయణం

రైల్వే జోను- పరేషాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటిగా ఉత్తరాంధ్ర ఐదు దశాబ్దాల న్యాయమైన కోరిక, విభజన చట్టంలోని హక్కు విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుచేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు. లక్ష కోట్ల బుల్లెట్ రైళ్లు అహ్మదాబాద్‌కి అలవోకగా ప్రకటించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం బ్యాలెట్ రైలుని ఎన్నికల ముందు పట్టాలెక్కించింది. అయితే అది కూడా ‘వేలికి ఉంగరం తొడిగి, మెళ్ళో గొలుసు కొట్టేసిన బాపతు’ వ్యవహారం కావడం కించిత్ శోచనీయం. కొత్త జోన్ ఇచ్చినట్టేఇచ్చి ఉన్న డివిజన్‌ని ముక్కలుచేసి పారేసింది. వాల్తేరు డివిజన్ ఏర్పడి 125 సంవత్సరాల పండుగ ఈమధ్యనే జరిగింది. దాన్ని విడగొట్టి అందులో ఏటా ఏడువేల కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్న కేకే లైనుని రాయగడ డివిజన్‌లో కలిపింది. ఆ మిగిలిన అల్పాదాయ భాగాన్ని రాష్ట్రంలోని మిగతా భాగంతో కలిపి కొత్త జోన్ ఇచ్చాం అంటూ ఘనంగా ప్రకటించింది. కేకె లేను మినహాయించడమంటే ముఖ్య వనరుని కోల్పోవడమే. అయితే కొత్త రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ జోనుకి కేటాయిస్తే ఉద్యోగాల విషయంలో న్యాయం చేసినట్టే. దానిపై ఇంకా స్పష్టతలేదు. ప్రయాణికుల సదుపాయాలు, ఈ జోను కేంద్రంగా జరగబోయే అభివృద్ధి, కొత్త ప్రాంతాలకు మెరుగయ్యే ప్రయాణ సౌకర్యాల విషయమై రాబోయే కేంద్ర పాలకుల శ్రద్ధబట్టి ఫలితం ఉంటుంది. ఇప్పటికిప్పుడు సంతోషించాల్సిందేమీ లేదు.
- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం