ఉత్తరాయణం

గాడ్సేను మించిన ప్రమాదకారులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల వేళ కొందరు కాంగ్రెస్ నేతలు గాడ్సే ప్రస్తావన తెస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ, ‘గాంధీ భారత్’ కావాలో, ‘గాడ్సే భారత్’ కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. అలనాడు దేశ విభజన వేళ భారత్ పాకిస్తాన్‌కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించటం, కొంత చెల్లింపులు జరిగిన పిమ్మట కాశ్మీర్‌పై పాక్ దాడి చేయటంతో మన ప్రభుత్వం మిగతా బకాయిని పెండింగ్‌లో పెడితే- ఒప్పందం ప్రకారం నిధులను పూర్తిగా చెల్లించాలని గాంధీజీ పట్టుబట్టాడట. ఇలా హిందువులకు నష్టం కలిగేలా ముస్లింల వైపు గాంధీ మొగ్గు చూపుతున్నాడని, ఆయన జీవించినంత కాలం హిందువులకు న్యాయం జరగదనే భావంతో ‘జాతిపిత’ను గాడ్సే హత్య చేశాడంటారు. ఆ దుస్సంఘటన జరగకపోతే గాంధీజీ తాను గతంలో సూచించినట్లు కాంగ్రెస్ పార్టీని రద్దుచేయాలనో, పాలనలో లోటుపాట్లపైనో ఆందోళనలు చేసి కాంగ్రెస్ వారిని ఇరకాటంలో పెట్టేవాడేమో!
ఇక నేడు కొందరు నేతలు పదవి లేకపోతే బతకలేమనే స్థాయికి చేరారు. ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్షుడు సైతం పదవీ విరమణ పిమ్మట సామాన్యుడి వలే ప్రజానీకంతో మమేకమైపోతుంటే, మన ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా సమాజంలో కలవరు. కొందరు ప్రజాసేవ ముసుగులో సొంత వ్యాపారాలను వృద్ధిచేసుకుంటూ, సిద్ధాంతాలు పక్కనబెట్టి అధికార పార్టీలో చేరటం, కొన్ని తరాలకు సరిపడే సంపద కూడా పెడ్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మిగతా ప్రజాస్వామ్య దేశాల్లో కేవలం నాలుగైదు ఓట్ల తేడాతో ప్రభుత్వాలు సుస్థిరంగా పనిచేస్తుంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు అంగడి సరుకుగా మారుతున్నారు. పార్టీ మారటానికి కారణం ‘నియోజకవర్గం అభివృద్ధి గురించి’ ఆలోచించడమేనని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసమస్యలను ప్రభుత్వం దష్టికి తేవచ్చు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాలు చేపట్టవచ్చు. నేతల అసలు రాజకీయం తెలియని అమాయక ప్రజలు కక్షలు, కార్పణ్యాలు పెంచుకుంటారు. ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై మన వాయుసేన జరిపిన దాడులపైనా కొందరు నేతలు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించినంతగా ఉగ్రవాదులు చనిపోలేదనీ, ఎన్నికల ముందు ఇటువంటి సంఘటనలు జరగడం అనుమానాస్పదంగా ఉందని విపక్ష నేతలు కొందరు అన్నారు. ఇటువంటి వ్యాఖ్యానాలతో అంతర్జాతీయంగా మనం అభాసుపాలవుతాం. మన వాయుసేన దాడుల లక్ష్యం- తీవ్రవాదులు ఎక్కడ దాగినా శిక్షిస్తామని భయపెట్టటానికే.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట
అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ
‘సంపద సృష్టి, వరాల వృష్టి’ శీర్షికతో ఇదే పేజీలో వచ్చిన వ్యాసంలో కేంద్ర ప్రభుత్వం ప్రగతిశీల పాలన ఇస్తున్నట్లు గణాంకాలను ఘనంగానే చూపారు. ఇదంతా నాణానికి ఒకవైపు కనిపిస్తున్న కాకిలెక్కలు అని చెప్పక తప్పదు. యూపీఏ హయాంలో కంటే ఎన్‌డీఏ సర్కారు ఎంతో ప్రగతి సాధించినట్లు చెబుతున్నా, ఆర్థికపుష్టి ఏ మేరకు సామాన్యుడి చెంతకు చేరిందో విశే్లషించాలి. రైల్వే వసతులకు కోట్లు ఖర్చుపెట్టారని, బ్రాడ్‌గేజి లైన్లు వేల కిలోమీటర్లు వేశారని అంటున్నారు. గుజరాత్, మహారాష్ట్రాల వైపు అభివృద్ధికి ఖర్చుపెట్టి, సామాన్యుడి రైలు టిక్కెట్టు, రిజర్వేషన్ ఖర్చులను ఇబ్బడి ముబ్బడిగా పెంచేసి, కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణిస్తున్నవారి గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? ఒకటో, రెండో బుల్లెట్ ట్రయిన్లు వేసి భుజాలు చరుచుకోవడం ఘనత కాదు. పేదలకు ఇళ్ళు కోటి కట్టించామని చెపుతూ, సామాన్యులు కట్టుకున్న ఇళ్ళపై జిఎస్టీ పేరున అధిక పన్నులు వేయడం, ఇళ్ళనిర్మాణంపై, ఇసుక, ఇనుము, సిమెంట్‌పై రేట్లుపెంచి, ఉచితంగా పేదలకు ఇళ్ళుకట్టించామని గొప్పలు చెప్పుకోవడం నేతలకు తగదు. ఆర్థికస్థితి విషయంలో ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని 6వ స్థానం నిలబెట్టుకున్నామన్న గర్వం కన్నా, పెద్దనోట్ల రద్దుతో, జీఎస్టీ అమలుతో ప్రజానీకాన్ని ముప్పుతిప్పలు పెట్టి, కార్పొరేట్లకు లాభాలు పెంచి దేశ ప్రగతికి తాము కంకణం కట్టుకున్నామని భుజాలు ఎగరేసుకోవడం సంబరం కాదు. కోట్ల సంఖ్యలో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పుకునే ముందు, ఇంట్లో ఇల్లాలు వంట సామగ్రికి తగినంత డబ్బులేక, ప్రతి వస్తువుపై పన్నుభారంతో బాధపడుతుంటే ఆ కనెక్షన్లన్నీ వ్యాపారులకు అమ్ముడుపోతున్నాయి. నిరుద్యోగుల కోసం కోట్లు వెచ్చించామనడం సబబైతే- వారిని మందభాగ్యుల్ని చేయడమే అవుతుంది. వారికి పని కల్పించకుండా ఉచితంగా విద్యనందించకుండా కూర్చోపెట్టి డబ్బిస్తే చెడు వ్యసనాల్ని ప్రోత్సహించడమే కదా! అదికూడా ప్రగతి అనే చెప్పుకునే దౌర్భాగ్యస్థితిలోకి మనం రాకూడదు. ఆదాయపు పన్నుదార్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగారని భావిస్తే, పింఛను తీసుకునే వృద్ధుల్నికూడా వదలకుండా నోటీసులిచ్చి, బలవంతంగా ఆదాయపు పరిధిలోకి తోసివేయడం కూడా మేలుచేసినట్లే భావించాలా? ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పిస్తామని చెపుతూ, ఇప్పటివరకు రిజర్వేషన్లు పొందుతున్నవారు కూడా ఆర్థికంగా వెనుకబడే వున్నారని గుర్తించకపోవడం తమాషాగా గోచరిస్తోంది. మరోవైపు నిరుద్యోగులకు ఉపాధి అని చెపుతూ బ్యాంకు ఋణాలు లక్షల కోట్లు ఇచ్చామని గణాంకాలు చూపడం, మాల్యాలు, నీరవ్ మోదీలు వేల కోట్ల రూపాయలు తీసుకుని బ్యాంకుల్ని మోసగించి విదేశాలకు పారిపోవడం విడ్డూరం. ఎన్నికల ముందు తాయిలాలు ఇచ్చి మళ్ళీ అధికారంలోకి రావడానికి నేతలు యత్నిస్తే ప్రజలేమీ తెలివి తక్కువవారు కాదు. నాయకుల్ని బేరీజు వేసుకొని, ప్రగల్భాలు పలికే వారికి ఓటర్లు సరైన సమాధానం చెప్పేరోజు దగ్గరకొచ్చింది.
-అడపా రామకృష్ణ, విశాఖ

రాజ్యాలుంటే మేలేమో?
‘వీరాజీయం’ (14-మార్చి) శీర్షికలో రచయిత వీరాజీ చెప్పినట్టు- ‘ఇది ప్రజాస్వామ్యమా?’ అని జనం నోళ్ళు వెళ్ళబెట్టే పరిస్థితి వచ్చింది. చరిత్ర మళ్ళీ పునరావృత్తం అవనీయండి. రాజులు, రాజ్యాలు వస్తే మళ్ళీ చూడాలని ఉంది. కానీ, ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల ప్రహసనాలు మాత్రం చూడకుండా, వినకుండా కళ్ళు, చెవులు మూసుకుంటే సరి. ఇప్పటి ధోరణుల్ని చూస్తే రాష్ట్రాలు అంతరించిపోయి రాజ్యాలు అవతరించేట్లున్నాయి. రాజకీయ పార్టీల మధ్య వుండే పోరు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నాయకుల మధ్య పరస్పర వైషమ్యాలు గాలివానగా మారుతూ ప్రజాస్వామ్యం నీరుకారి పోతోంది. ఇప్పుడు వైషమ్యాలు ఆవరించడంతో రాష్ట్రాలకు బదులుగా రాజ్యాలుంటేనే బాగుంటుందేమో! ప్రతిపక్షం లేకుండా చెయ్యాలని కొందరు నేతలు చెందే తపన చూస్తుంటే రాజ్యవ్యవస్థ వచ్చి తీరేలా ఉంది. రాజ్యకాంక్షలున్న ప్రస్తుత ప్రజాస్వామ్య నాయకుల్ని ప్రజలు ఆరాధ్యదైవాలుగా కొలుస్తూ ఉండటం వల్లే ప్రజాస్వామ్యానికి ఈ దురవస్థ ఏర్పడింది. దీన్ని ప్రజలు కూడా గమనించాలి.
-్భమేశ్వరరావు వేమవరపు, సికిందరాబాద్