ఉత్తరాయణం

మోదీ చేసిందేమిటి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించి, అభివృద్ధికి కృషిచేయడమే తన ధ్యేయమని చెప్పి గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన ఘనుడు నరేంద్ర మోదీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తరువాత విదేశీ పర్యటనలపై చూపించిన శ్రద్ధ పరిపాలన మీద చూపించక పోవడంతో పలు సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. పెద్దనోట్ల రద్దుతో బ్లాక్‌మనీ బయటకు వస్తుందని మోదీ చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించారు. నోట్లు రద్దుతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు వౌనంగా భరించారు. బ్లాక్‌మనీ బయటకు రావడం దేవుడెరుగు.. నోట్లు లభించక ప్రజలు నానా ఇక్కట్లకు గురయ్యారు. అదే సమయంలో బ్యాంకు రుణాలు తీసుకొని ఎగవేసిన ఘనులు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సి వంటి ఘరానావ్యక్తులు విదేశాలకు పారిపోవడానికి పాలకులు చక్కగా సహకరించారు. వారిని విదేశాల నుంచి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని వాడుకోవడంతో బీజేపీ ఉలికిపడుతోంది. ఆర్థిక నేరస్థులపై కఠినంగా వ్యవహరించడంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించడంతో లండన్‌లో విలాస జీవితం గడుపుతున్న నీరవ్ మోడీని అరెస్టుచేసి తాము ఆర్థిక నేరస్థుల పట్ల కఠినంగానే ఉన్నట్టు చెప్పుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇదే పని కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేస్తే బీజేపీకి మంచి మైలేజీ వచ్చేది. కేంద్ర ప్రభుత్వం దీనిని తమ గొప్పతనంగా చెప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవలక్షణాలు కలిగి ఉందో ప్రస్తుతం బీజేపీదీ కూడా అదే పరిస్థితి. రాఫెల్ కుంభకోణంపై ప్రతిపక్ష పార్టీల అసమర్థత కారణంగా బీజేపీ ప్రభుత్వం నిజాలు బయటకు రాకుండా చేయగలిగింది. తన హయాంలో ఎటువంటి తప్పులు జరగలేదని చెప్పుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల మధ్య అనైక్యత బీజేపీ పాలిట వరప్రసాదంగా మారింది. ఎన్నికలలో గెలుపొందటానికి కాంగ్రెస్ మాదిరిగానే జిమ్మిక్కులు చేస్తూ, రాజకీయ విశే్లషకులను సైతం ‘ఔరా’ అనిపించేలా మోదీ రాజకీయ చదరంగంలో తెలివిగా పావులు కదుపుతున్నారు.
-పొనుగుపాటి మస్తాన్‌రావు, గుంటూరు