ఉత్తరాయణం

ఇస్లామిక్ దేశాలతో మైత్రి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఏసీ) స్వర్ణోత్సవ వేదికపై భారత్ తన గళాన్ని బలంగా వినిపించడం, ఉగ్రవాద పెనుభూతాన్ని మట్టుపెట్టడంలో ఇస్లామిక్ దేశాల సహకారాన్ని కోరడం హర్షణీయం. సర్ణోత్సవ వేదికపై భారతదేశాన్ని అడుగుపెట్టనీయకుండా తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్‌కు ఈ తాజా పరిణామం ఒక చెంప దెబ్బ. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ మన దేశంపైకి కయ్యానికి కాలు దువ్వుతూ, కశ్మీరు లోయలో అరాచకం సృష్టిస్తూ ఎంతోమంది జవాన్లు, సాధారణ పౌరుల ప్రాణాలను ఉగ్రవాది రక్కసి హరిస్తుంటే పాక్ వినోదం చూస్తోంది. ఓఏసీ వేదికపై భారతదేశానికి విరుద్ధంగా కల్లబొల్లి కబుర్లుచెప్పి మొసలికన్నీరు కారుస్తున్న దాయాది దేశానికి ఈసారి ప్రత్యేక అతిథిగా ఇండియా హాజరు కావడం గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయ్యింది. మతమంటే ఉగ్రవాదమని భాష్యం చెబుతున్న పాకిస్తాన్‌కు, ఉగ్రవాదం ఒక మతానికి సంబంధించినది కాదని, హింసతో ఎవరూ ఏమీ సాధించలేరని, ప్రగతి సాధించడానికి మనమందరూ కలిసి సాగుదాం అని ఓఏసీ సదస్సులో భారత్ తన వాణిని వినిపించడంలో సఫలీకృతమైంది. ఇది మన ప్రభుత్వ దౌత్యనీతికి మరొక విజయం. 1969లో ఓఏసీ ప్రారంభించినప్పుడు సౌదీరాజు ఫైజల్ భారత్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినా, ఆ సదస్సులో భారత్ పాల్గొనకుండా మతవ్ఢ్యౌన్ని అడ్డంపెట్టుకొని మోకాలడ్డిన పాకిస్తాన్ అప్పటినుండి గత సంవత్సరం దాకా ఇదే వైఖరి కొనసాగించడం ఆ దేశ దురహంకార శైలికి మచ్చుతునక. పాక్ అసత్యాలకు మొదట్లో వత్తాసు పలికిన యుఏసి, టర్కీ, సౌదీ అరేబియా దేశాలు మన ప్రభుత్వ చొరవతో వైఖరి మార్చుకొని, ఈసారి పాకిస్తాన్ అభ్యర్థనను తోసిపుచ్చి అయిదు దేశాల ఇస్లామిక్ సహకారం, సౌభాగ్యానికి, అభివృద్ధికి మార్గసూచీ నిర్మాణం పేరిట ఆబూదాబీ వేదికగా జరిగిన సదస్సులో భారత్‌ను ఆహ్వానించడం హర్షణీయం. 2003 వోఏసీ సదస్సులో అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషరాఫ్ ఉగ్రవాద పంథాను వీడి, ప్రగతి సాధించేందుకు ఆర్థికాభివృద్ధి బాటలో నడుస్తామని ముస్లిం దేశాలలో ఉగ్రవాదం వెర్రితలలు వేయకముందే కూకటివేళ్ళతో పెకిలించాలని, పేదరికం నిరుద్యోగంతో తమ దేశం సతమతవౌతోందని మొసలికన్నీరు కార్చారు. ఉగ్రవాద పెనుభూతాన్ని తరమడానికి అగ్రరాజ్యం ఆపన్నహస్తం అందించాలని కల్లబొల్లి మాటలతో అమెరికాను నమ్మించి భారీగా నిధులు రాబట్టుకొన్నారు. అలా సమకూర్చుకున్న నిధులను దేశ సంక్షేమానికి కాకుండా, మారణాయుధాలను సమకూర్చుకోవడానికి, ఉగ్రవాదాన్ని పోషించడానికి ఉపయోగించడం హేయం. మత ఛాందసుల ఎరకు అక్కడి యువత ఉగ్రవాదాన్ని తమ ఊపిరిగా, ఉపాధిగా మలుచుకొని అరాచకాలను సృష్టించడం అలవాటైంది. ప్రభుత్వాలు ఎన్నిమారినా ఆ దేశంలో ప్రజలకు శాంతి, సౌఖ్యం దక్కడం లేదు. నిరంతరం బాంబుల మోతతో ఆ దేశం దద్దరిల్లడమే కాకుండా, ఆ ఉగ్రమూకలు మన దేశంలోనికి చొచ్చుకువచ్చి ఇక్కడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. వారు ఎంత మత దురహంకారంతో దహించుకుపోతున్నారో అనేక సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. పుల్వామా దాడి తర్వాత పాక్ చుట్టూ ఉరితాడు బిగించడానికి భారతదేశం ఓఏసీ దేశాల మద్దతుకూడగట్టి, వారినుండి వచ్చే నిధులను ఆపుచేయించి, ఆ సంఘం నుండి పాకిస్తాన్‌ను వెలివేయగలిస్తే మన దేశంలో శాంతి వెల్లివిరుస్తుంది.

-సి.కనకదుర్గ, హైదరాబాద్