ఉత్తరాయణం

అవినీతిపై దాడి మంచిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టవ్య్రాప్తంగా అవినీతి అధికారులపై ఆకస్మిక దాడులు జరిపి భారీగా అవినీతి సొమ్మును పట్టుకుంటున్న ఎసిబి అధికారుల చర్యలు సమంజసం. ఎవరి ఒత్తిడికీ లొంగకుండా ఇటీవలి కాలంలో పెద్దపెద్ద అవినీతి తిమింగలాలను ఉభయ తెలుగు రాష్ట్రాలలో పట్టుకోవడం మేలైన పరిణామం. ఎసిబి అధికారులు చిత్తశుద్ధితో ఇలాగే వ్యవహరిస్తే అవినీతికి అలవాటుపడిన అధికారుల్లో కొంతలో కొంతైనా భయం కలుగుతుంది. సామాన్యులకు అందువల్ల మేలు కలుగుతుంది.
-ఎల్.ప్రపుల్లచంద్ర, ధర్మవరం
తొలగని మూఢ నమ్మకాలు
భక్త్భివం మంచిదే. అది అతిగా మారి మూఢనమ్మకం మీదకు మనసు మరలితే విషాదమే మిగులుతుంది. కర్రలతో కొట్టుకోవడం, జంతువులతో పోరాటం, నిప్పులపై నడక వంటి చర్యలు ఆ కోవకు చెందినవే. మన నమ్మకాలు, విశ్వాసాలను ఆసరా చేసుకుని రంగురాళ్ల వ్యాపారం, జ్యోతిషం పేరుతో వ్యాపారం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కర్నూలు జిల్లా బన్ని ఉత్సవం పేరిట ప్రజలు పరస్పరం చావకొట్టుకోవడంలో విశ్వాసం కన్నా మూఢత్వమే కనిపిస్తోంది. తీవ్రంగా గాయపడ్డవారిని చూస్తే బాధ కలిగింది. ఇలాంటి క్రీడల వల్ల ఎవరికీ కీడు జరగకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
చంద్రవంక పూర్తయ్యేనా?
గుంటూరు జిల్లా మాచర్లలో చంద్రవంక పట్టణం శివార్లలో ప్రారంభమైన వంతెన పనులు ఐదేళ్లయినా పూర్తికాలేదు. ఇప్పటికే పూర్తయిన కొన్ని పనులు అప్పుడే పాడయ్యాయి కూడ. చంద్రవంక గ్రామానికి అటువైపు ఉన్నవారు ఇటు రావాలంటే రైలుపట్టాలు దాటాలి. ఇక్కడ రైలు క్రాసింగ్ లేదు. అందువల్ల ప్రమాదాలు జరగకుండా ఇక్కడ ఐటిడిఎ సహకారంలో కోటిన్నర వ్యయంతో ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం వల్లే పనులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల వర్షాలు కురిసినప్పుడు ఈ ట్రాక్ సమీపంలో రెండు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. రెండుమూడు రోజులపాటు చంద్రవంక, పరిసర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించి ఇక్కడి వంతెన పనులు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.
-ఎం.కనకదుర్గ, తెనాలి