ఉత్తరాయణం

ప్రజాస్వామ్యం అపహాస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న రాజకీయ పార్టీల తీరు ప్రజలను అయోమయానికి గురిచేయడమే కాకుండా, ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేయించవలసిన ఈ తరుణంలో నిరంకుశత్వం వైపు సాగనంపుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తున్నారు. ఎందుకంటే ఎంత అనుభవించినా తనివితీరని అధికార దాహం ఒకవైపుగా, మహాపాతకాలకు దారితీసే క్రోధం ఇంకోవైపూ, ఎలాగైనా గెలుపే ముఖ్యం అనే తలంపు ఆయా రాజకీయ పార్టీలలో చోటుచేసుకొంది. రాజకీయ ప్రమాణాలకు పాతరేసి ఒకరి మేనిఫెస్టోలను ఇంకొకరు అనుకరిస్తూ, ఉచిత పథకాలతో వంచిస్తూ జనం కోపానికి కారణం అవుతున్నాయి. వినాశకరమైన రాజకీయ పార్టీలుగా చరిత్రలో కొత్త గుర్తింపు కోసం పాకులాడుతున్నాయి. ప్రస్తుత తరుణంలో రాజకీయం అనేక రూపాలలో విస్తరించడంతో నటులూ, కర్కోటకులూ అని తేడాలేకుండా రాజకీయాలను ఆశ్రయించేవారి సంఖ్య బాగా పెరిగిపోసాగింది. దాంతో సామాన్యుడికి రాజకీయ రంగంలో చోటులేకుండా పోయింది. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే వాళ్ళను ఎలాగైనా ప్రజలకు దూరం చేయాలనే యావలో ఉన్న నటులు రాజకీయాల్ని సేవారంగంలా కాకుండా ఒక ప్యాకేజిగా మలుచుకోవడానికే ఇయ్యరాని ప్రాధాన్యతను ఇస్తున్నారు. అధికారానికీ, రాజకీయానికి భిన్నత్వం చూపడం రాజకీయాన్ని, అధికారాన్ని సమన్వయం పరచడం అనేది చాలా తెలివైన పని. ఇలా తమ నిరకుశ పాలనను దృఢ పరుచుకోవచ్చనే ఆలోచన తనివితీరని అధికార దాహం వెనుక దాగిన ఒక రహస్య ఎజెండా.
- పోలుమాటి రాంబాబు 88973 72121
వరాల చాటున పన్నుపోట్ల ప్రమాదం!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలని మన నేతలు సాధ్యాసాధ్యాలు పట్టించుకోకుండా, ‘మన కాళ్లు కాకపోతే కాశీవరకు దేకవచ్చు’ అన్న చందాన వివిధ పథకాల పేరుతో ప్రజలకు ఎర వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ఉదారంగా పెంచే పాలకులు తమ సంస్థల్లో పనిచేసేవారికి ఆ విధంగా పెంచలేరు. తమ కుటుంబీకులకు వందల ఎకరాలను, వేల కోట్ల రూపాయలు దోచిపెడుతూ చిన్నచిన్న తాయిలాలతో పేదలను మభ్యపెడతారు. పలురకాల పెన్షన్లను పెంచటం, పెరుగుతున్న ఆర్థికభారం తట్టుకోడానికి మద్యం దుకాణాలను పెంచి తాగుడును ప్రోత్సహిస్తుంటారు. బాధ్యతలు మరిచి కొందరు తాగుబోతులుగా మారుతున్నందున నేరాలు, ఘోరాలు పెచ్చుమీరుతున్నాయి. ‘పసుపుకుంకుమ’ పథకం సంగతేమో గాని తాగుబోతులైన భర్తల కారణంగా ఎందరో మహిళలు పసుపు కుంకుమలకు దూరం కావటం, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం కావటం చూస్తున్నాము. క్రమశిక్షణ లేని జాతి పునాది లేని భవనం వంటిదే. మన నేతలు నిత్యం స్మరించే సింగపూర్, చైనా, జపాన్, ఇజ్రాయిల్ వంటి దేశాలు కఠోరమైన క్రమశిక్షణతోనే అగ్ర రాజ్యాలుగా ఎదిగాయి. అడగని వాళ్ళదే తప్పు అన్నట్లు తెల్లకార్డుల మొదలు గృహరుణాలు, పింఛన్లు వంటి అన్ని సంక్షేమ పథకాల్లో పేదలతోపాటు ఖరీదైన వాహనాల్లో తిరిగే వారు సైతం యధేచ్ఛగా లబ్దిపొందుతున్నారు. ఒకప్పుడు మన సమాజంలో ఏదైనా ఉచితంగా తీసుకోవటం నామోషీగా భావించేవారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లో చేరి సొంత ఆస్తులు పోగొట్టుకున్న నేతలెందరో వున్నారు. నేడు బడానేతలే తమ కుటుంబాలకు కోట్లాది రూపాయలు కూడబెట్టటం, విలాసవంతమైన వినియోగ సంస్కృతి, జీవన వ్యయం పెరిగి తామూ ప్రభుత్వ రాయితీలు పొందితే తప్పులేదనే భావన పెరిగిపోతుంది. వేరుపురుగు చేరి వృక్షాన్ని నాశనం చేసినట్లు ప్రజాకర్షక పథకాల్లో అవినీతి, అక్రమాలతో జాతి నిర్వీర్యమైపోతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో మునిగి వుంది. ప్రజలు కోరని వరాలతో పన్నుపోట్లు తప్పదు. బడ్జెట్లు భారీగా పెరగటానికి పన్నుపోట్లు కూడ ఒక కారణమే. కనుక ప్రజలు ఈ వాస్తవాలు గ్రహించి ప్రలోభాలకు లొంగకుండా కుల, మత, పార్టీ విభేదాలకతీతంగా ప్రజాసేవకోసమే రాజకీయాల్లోకి వచ్చిన, నైతిక విలువలు కలిగిన అభ్యర్థులకు మద్దతిస్తే నిజాయితీగల పాలకులతో పరిపాలన మెరుగుపడుతుంది. అవినీతి, అక్రమాలకు కళ్ళెం వేస్తే ప్రజలపై పన్నుపోట్లభారం తప్పుతుంది. ఎరగా వేసే మెతుకుల కోసం చూస్తే బతుకులు పాడైపోతాయి. దినం గడవడం కాదు, తరం గడవాలని పెద్దలు చెప్పిన మాటలు మనకు శిరోధార్యం.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట