ఉత్తరాయణం

సచ్ఛీలురనే ఎన్నుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి వ్యక్తిత్వం ఉన్నవారు, సచ్ఛీలురు, ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేసే సమర్ధవంతమైన నాయకులు ఉన్నత పదవుల్లో వుంటేనే రాజ్యాంగ వ్యవస్థలు సజావుగా పనిచేసి దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నది మన రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష. కానీ, నేడు దేశంలో ఆ స్ఫూర్తి కొరవడుతోందని పలువురు రాజ్యాంగ నిపుణులు, సామాజిక విశే్లషకులు వాపోతున్నారు. ఒకప్పుడు విద్యావేత్తలు, సామాజికవేత్తలు, సమాజసేవకు అంకితమైనవారు మరింత మెరుగైన ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చేవారు. అలాంటి కొంతమంది రాజకీయవేత్తలను ఇప్పటికీ స్మరించుకుంటూ వున్నాం. కాలక్రమేణా పరిస్థితులు మారాయి. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థల అధిపతులు, కోట్లకు పడగలెత్తినవారు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు రాజకీయాలను సాధనంగా వాడుకోవడం మొదలుపెట్టారు. వారితోపాటు నేరచరిత్ర వున్నవారు, హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడినవారు సైతం రాజకీయాల్లోకి రావడం మొదలుపెట్టారు. గెలుపు గుర్రాల పేరిట అన్ని రాజకీయ పార్టీలు వారికే పార్టీకండువాలు కప్పి టిక్కెట్లు ఇవ్వడం మొదలుపెట్టాయ. దీంతో మొత్తం రాజకీయ వ్యవస్థే భ్రష్టుపట్టిపోయింది. రాజకీయ అవినీతి ఎన్నడూ లేనంతగా వేల కోట్లకు పెరిగిపోయింది. అక్రమంగా సంపాదించిన డబ్బును ఓట్ల కొనుగోలుకు వాడుతున్నారు. ఎన్నికలంటే ధనమయం, మందుమయం అయిపోయింది. చట్టసభల ప్రతినిధులుగా ఎన్నికవుతున్న నేతల్లో పలువురు అవినీతి, ఆశ్రీత పక్షపాతం, అక్రమాలకు తెగబడి రాజకీయ విలువలకు నిలువెత్తు సమాధికడుతున్న తీరు బాధాకరం. ప్రస్తుత ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు అనే వజ్రాయుధం ద్వారా సచ్ఛీలురను, సమర్ధులనే చట్టసభలకు ఎన్నుకునేలా ప్రజలు మరింత క్రియాశీలకంగా, అప్రమత్తంగా వ్యవహరించాలి.
- సిహెచ్ ప్రతాప్, శ్రీకాకుళం
విద్యావంతుల చెల్లని ఓట్లు!
ఇటీవలి శాసనమండలి ఎన్నికల్లో చెల్లని ఓట్లు నమోదు కావటం విస్మయం కలిగిస్తోంది. కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 532 ఓట్లు, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 858 ఓట్లు, కరీంనగర్ పట్ట్భద్రుల నియోజకవర్గంలో 412 ఓట్లు, ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గంలో 550 ఓట్లు చెల్లకుండాపోయాయి. ఓటువేసే విధానంపై అవగాహన లేకనో, నిరక్షరాస్యత తదితర కారణాలతో సాధారణ ఎన్నికల్లో చెల్లని ఓట్లు కనిపించడం సహజం. పట్ట్భద్రులు, ఉన్నత చదువులు పూర్తిచేసినవారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారిలో కొందరు వేసిన ఓట్లు చెల్లకపోవడం గమనార్హం. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు చేసిన పొరపాట్ల వలన ఓటర్ల జాబితాల్లో విపరీతమైన తప్పులు దొర్లాయి. కొందరు ఓటర్లకు తమ సొంత మండలంలో ఉండాల్సిన పేర్లు పొరుగు మండలాల్లో దర్శనమిచ్చాయి. జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయుల పేర్లు సంగారెడ్డిలో ప్రత్యక్షమైతే, వారు అక్కడికి సుమారు 250 కి.మీ. ప్రయాణించి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. ఈ తరహా లోపాలను నివారించడానికి సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.
-గూరుడు అశోక్, గోదూర్