ఉత్తరాయణం

అనైతిక రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పార్టీలో టిక్కెట్టు దక్కని వారు రాజకీయ సిద్ధాంతాలకు, నైతిక విలువలకు తిలోదకాలిచ్చి పార్టీ ఫిరాయించడం, స్వప్రయోజనాల కోసం కండువాలు మార్చేయడం ప్రస్తుత ఎన్నికల్లో చూశాం. ఈ పరిణామాలు రాజకీయాలు ఎంత నీచానికి దిగజారాయో చెప్పకనే చెబుతున్నాయి. ఫిరాయింపుల నిషేధ చట్టం ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కుల సమీకరణలు, ధనం, నేరచరిత్ర ఉందు విలువలు వెలవెలపోవడం దురదృష్టం. రాత్రికిరాత్రే పార్టీ ఫిరాయించిన ఈ నాయకులు చట్టసభలలో జనం తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రజావాణిని వినిపిస్తారనుకోవడం అవివేకమే అవుతుంది. రాజకీయ పార్టీలు కూడా అంగడి సరుకును కొన్నట్లు వేరే పార్టీ నేతలకు పదవులు, ధనం ఆశ చూపించి చేర్చుకోవడం ప్రజాస్వామ్యవ్యవస్థ స్ఫూర్తికే విఘాతకరం. ఓటు విలువ దిగజారిపోవడం ఈ వ్యవస్థ చేసుకున్న దురదృష్టం. ధనస్వామ్యం రాజకీయాలను శాసిస్తుంటే, కులాల పోరులో నాయకులు కుమ్ములాడుకుంటుంటే ప్రజాస్వామ్యం ఎండమావిలా మారుతోంది. ఎన్నికల్లో పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడమే పరమావధిగా పనిచేసే స్వార్థ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టులా తయారయ్యాయి. చట్టసభలకు పోటీచేసే వారిలో 60 శాతం మంది అభ్యర్థులు కోట్లకు పడగలెత్తినవారు, 35శాతం మంది నేర చరితులు ఉండడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీనుండి 3వ వంతు సభ్యులు వేరుకుంపటిని చీలికగా గుర్తించేదిలేదని పార్లమెంటులో తీర్మానించినా, ఫిరాయింపులపై నిర్ణయాధికారం సభాపతిపై వుండడంతో గోడ దూకుళ్ళు యథేచ్ఛగా సాగడం దారుణం. ఈ జాడ్యం మన ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవకమునుపే ప్రజలు మేలుకోకపోతే భారీ నష్టం తప్పదు.
-సి.కనకదుర్గ, హైదరాబాద్
పత్రికా స్వేచ్ఛకు ఊతం
రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు వాదనకు సుప్రీం కోర్టు ఆదేశం అడ్డుకట్ట వేసినట్లయింది. ఆ ఒప్పందంలో మోదీ ప్రభుత్వం అతిక్రమించిన నియమాలను అధికార పత్రాల్ని సేకరించి మరీ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక బయట పెట్టింది. సుప్రీం కోర్టు ఇదివరకే ఇచ్చిన ప్రభుత్వ అనుకూల తీర్పు పునఃసమీక్ష కోసం ఆ పత్రాల్లో ఉన్న వాస్తవాల్ని గమనంలోకి తీసుకోవాలని కక్షిదారులు కోరగా, ఆ పత్రాలు దొంగిలించి సమర్పించబడినవి గనుక పనికిరానివని ప్రభుత్వం వాదించింది. పత్రాలు ప్రామాణికమైనవా? కావా? అన్న ప్రశ్న వేస్తే ఒక అర్థం ఉండేది కానీ ఇలా అడ్డగోలుగా వాదించడమే ఆశ్చర్యం. పైగా అధికార రహస్యాల్ని బయటపెట్టినందుకు ఆ పత్రికపై చర్యలు తీసుకుంటామని బెదిరించడం మరింత దుడుకు వైఖరి అని చెప్పాలి. పత్రికా స్వేచ్ఛపై, పరిశోధనాత్మక జర్నలిజంపై ప్రభుత్వం కత్తికట్టినా పత్రికారంగం ప్రజాస్వామిక స్ఫూర్తితో ఎదురు నిలవడం హర్షణీయం. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆ పత్రాల ఆధారంగా రాఫెల్ తీర్పు పునస్సమీక్షకు అనుమతించడం ప్రజాస్వామిక శక్తులకు ఊరట. అసలు సందేశాన్ని వదిలి, ఈ సందేశం మోసుకువచ్చే రాయబారిని శిక్షించేలా విపరీత ధోరణి ప్రదర్శించే ప్రభుత్వానికి అభిశంసన ఇది. ఇకనైనా రాఫెల్ ఒప్పందంలో జరిగిన అతిక్రమణలకు ప్రభుత్వం సరైన సమాధానాలు చెప్పాలి. తద్వారా కలిగిన నష్టాలకు బాధ్యత వహించాలి. విషయాన్ని దారి మళ్లించే ప్రయత్నాలు అన్ని వేళలా పారవు. వికటిస్తాయి.
-డాక్టర్ డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం