ఉత్తరాయణం

కల్తీల నియంత్రణకు తరుణమిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు పాలల్లో నీరు కలపటం, శనగనూనెలో పామాయిల్ కలపటం వంటివే నేరం. నేడు మనం తినే ఆహార పదార్థాల్లో కల్తీ చేసిన విష రసాయన పదార్థాలు కలపకపోతే చాలు అని సర్దుకుపోయే స్థితికి సమాజం వచ్చింది. అక్రమార్కులేమో ప్రజలు రోగాల బారిన పడినా, తమకు లాభమొస్తే చాలు అని ఆహార పదార్థాల్లో ముఖ్యంగా వంటనూనెలు, పాలు, పండ్లు వంటి వాటిల్లో విష రసాయన, జంతు అవశేషాలను సైతం కల్తీ చేసే స్థాయికి దిగజారారు. అందుకు కారణం మన పౌర సమాజంలో చైతన్యం కొరవడటం, నిజాయితీపరులైన ఉద్యోగులకు తగిన ప్రోత్సాహం లేకపోవడం. కొందరు ప్రజాప్రతినిధుల అనవసర జోక్యంతో కల్తీ యథేచ్ఛగా సాగుతోంది. తనిఖీలకు తగినంత సిబ్బంది లేరనే అధికారుల వాదన వాస్తవమే. ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. రాజకీయ పక్షాలు కూడా నిరుద్యోగుల గురించి గట్టిగా కృషి చేయటం లేదు. వేతన ఒప్పందాల వేళ ఉద్యోగ సంఘాలు ఖాళీల భర్తీకి కూడా పట్టుబట్టితే ప్రభుత్వం కచ్చితంగా దిగివస్తుంది. వివిధ సంక్షేమ పథకాలతో నానాటికీ ప్రభుత్వోద్యోగులపై పెరుగుతున్న పనిభారం, వత్తిడి తగ్గుతాయి. కొందరు ఉద్యోగులు మామూళ్ళు తమకు అందితే చాలని అక్రమాలను చూసీ చూడనట్లుంటారు. సంపాదన సంగతి తరువాత, కల్తీ ఆహార పదార్థాలతో వారు సైతం రోగాల పాలవుతారు. ప్రజారోగ్యం దెబ్బతినటానికి కల్తీలు కూడా కారణంమే. గతంలో గుట్టుగా కొంతమేరకు కల్తీలు జరిగినా, నేడు జనసమ్మర్దంగా వుండే ప్రాంతాల్లో సైతం గోడౌన్లు కట్టి బహిరంగంగా పెద్దఎత్తున కల్తీ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నందున ప్రజాప్రతినిధులు పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు. గనుక కల్తీ నిరోధక శాఖ, విజిలెన్స్, పోలీస్ శాఖల అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టి అక్రమార్కుల భరతం పట్టాలి.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట