ఉత్తరాయణం

కార్మికులపై ఎందుకింత వివక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకొనడానికి బదులు వారి ప్రయోజనాలకు భంగం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం అన్యాయం. కార్పొరేట్ కంపెనీలకు ఏటా లక్షల కోట్ల రూపాయల మేరకు రాయితీలు కుమ్మరిస్తున్న కేంద్రం కార్మికుల పెన్షన్ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. దేశవ్యాప్తంగా సుమారు 23లక్షల మంది కార్మికుల పెన్షన్‌కు కోత పడేలా ‘ఎంప్లారుూస్ పెన్షన్ పథకం- 1995’కు 2014లో కేంద్రం ప్రతిపాదించిన సవరణలను కొట్టివేస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇవ్వడం పాలకులకు చెంపపెట్టు. ఎలాంటి ఎదుగూ బొదుగూ లేకుండా 6,500 రూపాయల సీలింగ్‌తో ఎంత పెద్ద జీతగాడికైనా గరిష్టంగా 2,500 రూపాయలు మాత్రమే పెన్షన్ వచ్చే విధానాన్ని మెరుగు పరచాలని, అసంఘటిత రంగ కార్మికులకు సైతం పెన్షన్ ఇవ్వాలని, ఉచిత ఆరోగ్య బీమా వర్తింపచేయాలని దేశవ్యాప్తంగా కార్మికులు ఏళ్ల తరబడి ఆందోళనలు చేస్తున్నారు. మూల వేతనపు సీలింగ్‌ను ఎత్తివేసి, ఎలాంటి గరిష్ట పరిమితులు లేకుండా పెన్షన్‌ను నిర్ణయించాలని ఉద్యోగ, కార్మిక వర్గాలు కోరుతున్నాయి. ధరల పెరుగుదలకు అనుగుణంగా కరవు భత్యం ఇవ్వాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి మూల వేతనంపై మూడు శాతం ఇంక్రిమెంట్‌ను అన్ని వర్గాల ఉద్యోగులు, కార్మికులకు వర్తింప జేయాలని 2013లోచండీగఢ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంతవరకూ అమలు చేయలేదు. మోదీ ప్రధాని అయ్యాక ఏదో మేలు చేస్తారని ఆశించగా, కార్మికులకు అన్యాయం జరిగేలా పెన్షన్ చట్టానికి 2014లో సవరణలు ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీచేశారు. గతంలో యూపీఏ సర్కారు సుప్రీం కోర్టుకు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక సౌకర్యాలను రద్దు చేసింది. పెన్షన్ శాతాన్ని పెంచడానికి బదులు అర్హతా ప్రమాణాలను పెంచడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన సవరణలన్నీ ఉద్యోగ, కార్మిక శ్రేయస్సుకు ఆటంకం కలిగించేవే. 30-40 ఏళ్ల పాటు సమాజానికి సేవలందించి పదవీ విరమణ చేసిన వారికి జీవిత చరమాంకం సాఫీగా సాగేలా తగినంత పెన్షన్ ఇవ్వకపోవడం సమంజసం కాదు. కార్మికుల డిమాండ్లకు అనుగుణంగా ఇకనైనా కేంద్రం సంక్షేమ చర్యలకు ఉపక్రమించాలి.
-సిహెచ్ ప్రతాప్, శ్రీకాకుళం