ఉత్తరాయణం

‘హరితహారం’ కమిటీలు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానలకు, వనాలకు సంబంధం ఉన్నది. చెట్లు లేకుండా వర్షాలు రావు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా అడవులను వృద్ధి చేసి, గ్రీన్‌కవర్ పెంచాలని ప్రభుత్వం ‘హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అడవులు 33 శాతం ఉండేటట్లుగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గత మూడేళ్లలో 230 కోట్ల మొక్కలను- అటవీ ప్రాంతాల్లో 100 కోట్లు, హెచ్‌ఎండిఎ పరిధిలో పది కోట్లు, అటవీ ప్రాంతాల వెలుపల 120 కోట్లు మొక్కలను నాటారు. ప్రతి గ్రామంలో 40వేలు, ప్రతి నియోజకవర్గానికి 40 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నారు. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన గొప్ప ప్రయత్నాల్లో తెలంగాణలో హరితహారం మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నం. తెలంగాణ ఏర్పడే నాటికి గత 35 సంవత్సరాలలో నాటిన మొక్కలు 35 కోట్లుగా ప్రభుత్వ లెక్కల్లో ఉంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేవలం రెండున్నరేళ్ళలో నాటిన మొక్కలే 49.98 కోట్లు. గత ప్రభుత్వాలు అటవీ శాఖకు ఏడాదికి 13 కోట్లు ఖర్చుచేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన మూడేళ్ళకే 1,283 కోట్ల రూపాయలను ప్రభుత్వం అటవీశాఖకు కేటాయించింది. అంటే సగటున ఏడాదికి ప్రభుత్వం 400 కోట్లు పైగా పచ్చదనంపై ఖర్చుచేస్తుంది. ప్రభుత్వం కోట్లు వెచ్చించి మొక్కలను నాటడం హర్షించదగ్గ విషయమే కానీ, నాటిన కొన్ని మొక్కలకు రక్షణ కరువైంది. నాటిన మొక్కలకు రక్షణగా ట్రీగార్డ్స్ ఏర్పాటుచేస్తే, గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్తున్నారు. నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ప్రభుత్వం కోట్లు వెచ్చించి చేపడుతున్న కార్యక్రమం కాబట్టి పర్యవేక్షణ ఎంతైనా అవసరం. ఎంతో మంచి ఆశయంతో నాటిన ప్రతి మొక్కని కాపాడేందుకు ప్రభుత్వం 5 మందితో ‘హరితదళం’ అనే పేరు మీద పర్యవేక్షణ కమిటీలను నియమించాలి. ఈ కమిటీలో సామాజిక సేవా కార్యకర్తలను ఇద్దరినీ అటవీశాఖ నుండి ఒక్కరినీ, హెచ్‌ఎండిఎనుండి ఒక్కరిని, రెవిన్యూ శాఖ నుండి ఒక్కరినీ మొత్తం 5 మందితో రాష్ట్ర ప్రభుత్వం నాటిన ప్రతి మొక్కను రక్షించేందుకు ఈ కమిటీని నియమించాలి. వీరికి వాహనాలు కూడా సమకూర్చాలి. పచ్చదనం బాధ్యత వీరిపైనే వేయాలి.
- గుండమల్ల సతీష్‌కుమార్
వాహన రిజిస్ట్రేషన్లలో ఇక్కట్లు
వాహనాల లైసెన్స్ రెన్యూవల్, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకున్న అనంతరం కార్డుల కొరత మూలంగా నెలల తరబడిగా రవాణా శాఖలో జాప్యం అవుతోంది. వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాలను అధికారులు తనిఖీ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురుకావచ్చు. పాత కార్డు చూపిస్తే జరిమానా తప్పదు. కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసినపుడు ఇచ్చిన రశీదులను ఎంతకాలం దాస్తాం? కార్డుల కోసం ఎదురుతెన్నులు చూడాల్సి వస్తోంది. వాహనాలను వివిధ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసి కొత్త కార్డుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గతంలో సైతం కార్డులకొరత ఎదుర్కొనడం జరిగింది. వాహనాల సంఖ్య పెరుగుదల దృష్ట్యా అదనంగా కార్డులను ప్రింట్ చేస్తే ఇలా సమస్య ఉత్పన్నం కాదు. ప్రతి సంవత్సరం వాహనాల రిజిస్ట్రేషన్ పెరుగుతోంది. ఎంత కావాలో ఎన్ని అవసరమో అధికారులకు ఒక అంచనా ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్డులు పెంచుకుంటూపోతే సమస్య తలెత్తదు. సంబంధిత అధికారులు సత్వర చర్యలు గైకొని సమస్యను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.
- అయినం రఘురామారావు, ఖమ్మం