ఉత్తరాయణం

విద్యార్థుల పాలిట గుదిబండ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థుల జీవితంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఎంతో కీలకమైనవి. ఈ దశలోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బీజం పడుతుంది. అందుకే తల్లిదండ్రులు టెన్త్, ఇంటర్ ముగిసేవరకూ సంవత్సరాలపాటు తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు సర్వస్వం త్యాగం చేస్తారు. ఈ మూడు సంవత్సరాల విద్య ఒత్తిడి లేకుండా, జ్ఞాన సముపార్జన, వ్యక్తిత్వ వికాసం వృద్ధి చెందేలా సాగేందుకు సిబిఎస్‌ఈ, ఎన్‌సిఇఆర్‌టి సంస్థలు కృషిచేస్తుంటే- మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం పరిస్థితి భిన్నంగా వుంది. సాధారణ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడంతో కార్పొరేట్ శక్తులు పదవ తరగతి, ఇంటర్ విద్యను తమ కబంధ హస్తాలలో బంధించాయి. ప్రైవేట్ పరం అయిన విద్య ఇప్పుడు ఒక వ్యాపారంగా వర్ధిల్లుతోంది. వీధికొక కార్పొరేట్ కాలేజీ వెలిసి నాణ్యమైన విద్య మాట అటుంచి, తల్లిదండ్రులను నానారకాలుగా ప్రలోభపెట్టి లక్షల్లో ఫీజులు గుంజడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మార్కులు, ర్యాంకులు, గ్రేడుల కోసం విద్యార్థులను తరగతి గదుల్లో, హాస్టళ్లలో బంధించి చదువు పేరుతో రాచి రంపాన పెడుతున్నాయి. దీంతో మార్కులు, ర్యాంకుల పరుగుపందెం మొదలై విద్యార్థుల్లో ఆత్మన్యూనతాభావం పెరిగిపోతున్నది. అదే అంతిమంగా ఆత్మవిశ్వాసాన్ని హరించివేసి ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. విద్యార్థులలో సహజమైన తెలివితేటలు నశించిపోయి, బట్టీ చదువులతో రోబోలుగా మారిపోతున్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురై, అనేక శారీరక, మానసిక వ్యాధులకు గురై, పోరాటపటిమను కోల్పోయి చివరకు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితికి చేరుకుంటున్నారు. వైఫల్యాలే విజయ సోపానాలనే దృష్టిని విద్యార్థుల్లో ఏ దశలోనూ కలిగించలేకపోతున్నాం. మన విద్యావ్యవస్థలో పరీక్ష ఫెయిల్ కావడం అనేది చేతగానితనంగా నూరిపోసే భావన రోజురోజుకూ పెంచుతున్నారే తప్ప, విశే్లషణా సామర్థ్యం, విమర్శనాత్మక దృష్టి, పరిశోధనా పరిజ్ఞానం, హేతువాద దృక్పథం పిల్లల్లో కల్పించడం లేదు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపే విద్యబోధన ఆవశ్యకతను ఇప్పటికైనా తల్లిదండ్రులు, అధ్యాపకులు, పాలకులు, విద్యావేత్తలు గుర్తించాలి.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
‘బర్త్‌డే బంప్స్’ పేరిట హింస!
నేటి యువతరంలో పుట్టినరోజు వేడుకలు మరీ వెర్రితలలు వేస్తున్నాయి. ‘బర్త్‌డే బంప్స్’ పేరిట ఇటీవల ఓ విష సంస్కృతి విజృంభిస్తూ హింసాత్మక ధోరణికి కారణమవుతోంది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ పెడధోరణి నానాటికీ విస్తరిస్తోంది. ఈ కొత్త సంస్కృతి ప్రకారం బర్త్‌డే పార్టీ ఇచ్చే విద్యార్థిని పార్టీలో పాల్గొనే మిగతా వారు కొట్టడం వికృత చేష్టగా భావించాలి. పాతకక్షలు, పగలు మనసులో పెట్టుకొని ‘బర్త్‌డే పార్టీ’ని అదనుగా భావించి విచక్షణారహితంగా కొట్టే అవకాశం ఇందులో ఉంది. ఇలాంటి ప్రమాదకరమైన సంస్కృతిని ఆదిలోనే అరికట్టాలి. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేనందున ‘బర్త్‌డే బంప్స్’ ఎక్కడో ఒకచోట సాగుతున్నాయి. ఇలాంటి ధోరణులు తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే రేవ్ పార్టీలు, వీక్ ఎండ్ పార్టీలంటూ యువతీ యువకులు విచ్చలవిడితనంతో విలాసాలకు పాల్పడుతున్నారు. ఇవి చాలవన్నట్టు ఇపుడు ‘బర్త్‌డే బంప్స్’ పేరిట మరో ఉన్మాదం బయలుదేరింది. ఈ అలవాట్లకు బానిసలయ్యే విద్యార్థులకు కౌనె్సలింగ్ ఇప్పించాలి. ఈ చెడు సంస్కృతిని అరికట్టేందుకు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, పోలీసులు దృష్టి సారించాలి.
-అయినం రఘురామారావు, ఖమ్మం
*
ఇంకా తెలవారదేమి..?
(అభ్యర్థుల ఆలాపన)

ఏనాడో ముగిసెను పోలింగ్
ఈనాడే జరుగును కౌంటింగ్
ఇన్నినాళ్లు వేచిన కాండిడేట్
కాళ్లు వణికి వణికి పోతుంటే
ఇంకా తెలవారదేమి? ఈ లెక్కింపు మొదలవదేమి?

చరణం: నీతికి నిలబడు వానికి, ఏ ఓట్లు వచ్చి రాలవని
కోట్లు కరిగే ఆటలో డిపాజిట్లు కూడా దక్కవని
నేనెరిగిన లెక్కల పాఠం నేడే నేర్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి? ఈ లెక్కింపు మొదలవదేమి? = ఏనాడో=

చరణం: సీటుకు నిలబడు వానికి ఏ ఓటమి ఊహే తగదని
నిజాయితీ కనబడితే, జనమే తోడుగ వస్తారని
పిలిచి పట్టం కడతారని,
నేనమ్మిన కమ్మని సత్యం నీకే చెప్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి? ఈ లెక్కింపు మొదలవదేమి? = ఏనాడో=

(‘ఎన్నాళ్ళో వేచిన హృదయం..’ పాటకి పేరడీ)
- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం