ఉత్తరాయణం

అల్లూరి విగ్రహం పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు ప్రాంగణంలో విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. 2006లో అప్పటి ఎంపి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు ఎన్టీఆర్, అల్లూరిల విగ్రహాలను పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని సభలో ప్రస్తావించడం, కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించడం తెలిసిందే. ఆ తరువాతి పరిణామాల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారుగాని, మన్యం వీరుడిని మరిచిపోయారు. ఇప్పుడు అల్లూరి విగ్రహం ప్రతిష్టించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని కొత్తగా కాకినాడ ఎంపి తోట నరసింహం ప్రకటించడం హాస్యాస్పదం. రంపచోడవరం కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలను ప్రకటిస్తామన్న చంద్రబాబు ప్రకటన అమలుకాలేదు. ఆర్భాటాలకు, ప్రచారాలకు కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం కేవలం లక్షల్లో పూర్తయ్యే విగ్రహ ప్రతిష్ఠాపనను పట్టించుకోకపోవడం బాధాకరం.
-పడాల వీరభద్రరావు, రాజమండ్రి