ఉత్తరాయణం

కాంగ్రెస్‌కు గుణపాఠం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన నాయకత్వం, ముందుచూపు, దార్శనికత, ప్రజాసంక్షేమం, దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేసిన వైనం కారణంగా ప్రజలు ఎన్‌డిఏకి మరొకసారి అత్యద్భుతమైన విజయం అందించారు. భాజపా సునామీలో జాతీయ పార్టీలన్నీ దాదాపుగా కొట్టుకుపోయాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వరుసగా రెండవసారి లోక్‌సభలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేకపోవడం ఆ పార్టీ స్వయంకృతాపరాధం. ఆ పార్టీ నాయకత్వం ఒంటెత్తు పోకడలే ఈ ఓటమికి కారణమని చెప్పవచ్చు. ఏకవ్యక్తి పెత్తనాన్ని కోట్లాది జనం తలలూపే దేశంగా భారతదేశం వుండకూడదు అని తొలి ప్రధాని పండిట్ నెహ్రూ అభిలషించగా, తన వంశాంకురాల సారథ్యంలోనే ఆ పార్టీ ఇంత దీనస్థితికి వస్తుందని ఆయన కలలోనైనా ఊహించకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వంపై వున్న కొద్దిపాటి వ్యతిరేకతనైనా అందిపుచ్చుకోలేని అసమర్థ నాయకత్వం ఇప్పుడు ఆ కాంగ్రెస్‌లో ఉంది. తమ పరాజయానికి మోదీ ఆకర్షణ కారణమని కుంటి సాకులు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ విస్పష్ట సైద్ధాంతిక పునాదులు, సమర్థ నాయకత్వం, ప్రతిపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చే దార్శనికత, ఎన్నికల రణక్షేత్రంలో వ్యూహం లోపించడం వంటి చేదు నిజాలను గ్రహించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా కోటరీ విధానానికి స్వస్తి పలికి విశాల దృక్పథంతో, అభివృద్ధి ఎజెండాకు మద్దతు ఇస్తూ, బాధ్యతాయుత ప్రతిపక్షంగా పనిచేసి ప్రజల మన్ననలను పొందే ప్రయత్నం చేయకపోతే 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీస్థాయికి పడిపోయే రోజు ఎంతో దూరంలో లేదు.

-సిహెచ్ ప్రతాప్, శ్రీకాకుళం